దొడ్డిపట్టుమానినుల దొమ్మికాఁడా
(॥పల్లవి॥)
దొడ్డిపట్టుమానినుల దొమ్మికాఁడా
అడ్డములేని చేఁతలయాతఁడవా నీవు
(॥దొడ్డి॥)
చెంగట గోపికలఁ జెలరేఁగి యొకమాఁటే
జంగిలిగా మోహములు చల్లఁగాను
యింగిత మెఱిఁగి నీవు యిందరి కిన్ని రూపులై
అంగవించికూడినట్టియాతఁడవా నీవు
(॥దొడ్డి॥)
కోరికమీర మునులకొమ్మలెల్ల నీకు విందు
పేరులేనిరుచులతోఁ బెట్టఁగాను
కూరిమి చేకొని యట్టె గోపాలకులఁగూడి
ఆరగించివచ్చినట్టి ఆతఁడవా నీవు
(॥దొడ్డి॥)
ముందు గలుగ నీకు మోహమున రుకుమిణి
కందువ చెప్పి పుత్త్యాఁగఁ గైకొంటిని
యిందుకోపో యిందరు మోహించిరి శ్రీవేంకటాద్రి-
యందలివిట్ఠలుఁడనే అతఁడవా నీవు
(||pallavi||)
dŏḍḍibaṭṭumāninula dŏmmigām̐ḍā
aḍḍamuleni sem̐talayādam̐ḍavā nīvu
(||dŏḍḍi||)
sĕṁgaḍa gobigalam̐ jĕlarem̐gi yŏgamām̐ṭe
jaṁgiligā mohamulu sallam̐gānu
yiṁgida mĕṟim̐gi nīvu yiṁdari kinni rūbulai
aṁgaviṁchigūḍinaṭṭiyādam̐ḍavā nīvu
(||dŏḍḍi||)
korigamīra munulagŏmmalĕlla nīgu viṁdu
perulenirusuladom̐ bĕṭṭam̐gānu
kūrimi segŏni yaṭṭĕ gobālagulam̐gūḍi
āragiṁchivachchinaṭṭi ādam̐ḍavā nīvu
(||dŏḍḍi||)
muṁdu galuga nīgu mohamuna rugumiṇi
kaṁduva sĕppi puttyām̐gam̐ gaigŏṁṭini
yiṁdugobo yiṁdaru mohiṁchiri śhrīveṁkaḍādri-
yaṁdaliviṭṭhalum̐ḍane adam̐ḍavā nīvu