Doddavaanidodi pomdu doraginamta saaladaa

దొడ్డవానితోడి పొందు దొరకినంత చాలదా
Language

(॥పల్లవి॥)
దొడ్డవానితోడి పొందు దొరకినంత చాలదా
గొడ్డేరే మరికొంత కొసరూ వలెనా

(॥దొడ్డ॥)
తలఁచితి నపుడే తనరూపము మతి
కులికి కన్నులఁ గనుఁగొనవలెనా
బలిమి వీణెలోనఁ బాడితిఁ దనపదాలు
మలసి ఇంకా వేరే మాటలాడవలెనా

(॥దొడ్డ॥)
సేనవెట్టితి నపుడే చేతులకొలఁదులను
మూసి మంతనాల నేను మొక్కవలెనా
ఆసల నారూపు వాసింయంపితిఁ బటమునను
రాసికెక్క నే నింటికి రావలెనా

(॥దొడ్డ॥)
కూరిమితో నపుడె కొనగోరఁ జెనకితి
కోరి వేరే కాఁగిట నేఁ గూడవలెనా
ఆరయ శ్రీ వేంకటేశు నంటితి మీ మాఁట వింటి
నేరుపులు మీతోను నెరపఁగవలెనా

(||pallavi||)
dŏḍḍavānidoḍi pŏṁdu dŏraginaṁta sāladā
gŏḍḍere marigŏṁta kŏsarū valĕnā

(||dŏḍḍa||)
talam̐sidi nabuḍe tanarūbamu madi
kuligi kannulam̐ ganum̐gŏnavalĕnā
balimi vīṇĕlonam̐ bāḍidim̐ danabadālu
malasi iṁkā vere māḍalāḍavalĕnā

(||dŏḍḍa||)
senavĕṭṭidi nabuḍe sedulagŏlam̐dulanu
mūsi maṁtanāla nenu mŏkkavalĕnā
āsala nārūbu vāsiṁyaṁpidim̐ baḍamunanu
rāsigĕkka ne niṁṭigi rāvalĕnā

(||dŏḍḍa||)
kūrimido nabuḍĕ kŏnagoram̐ jĕnagidi
kori vere kām̐giḍa nem̐ gūḍavalĕnā
āraya śhrī veṁkaḍeśhu naṁṭidi mī mām̐ṭa viṁṭi
nerubulu mīdonu nĕrabam̐gavalĕnā