Doboosulaadelaraa gobaala naa manasamta neevenu

దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేను
Year
Language

పల్లవి:

దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా
ఆ ఏటి గట్టునేనడిగా చిరు గాలి నాపి నే నడిగా
ఆ ఏటి గట్టునేనడిగా చిరు గాలి నాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదు
ఆకాశాన్నడిగా బదులే లేదు
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా...

దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా

చరణం 1:

నా మది నీకొక ఆటాడు బొమ్మయ..
నా మది నీకొక ఆటాడు బొమ్మయ..
నాకిక ఆశలు వేరేవి లేవయ ఎద లోలో దాగదయా
నీ అధరాలు అందించ రా.. గోపాలా
ఆ....
నీ అధరాలు అందించ రా.. గోపాలా
నీ కౌగిలిలో కరిగించరా నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి
నా యెదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా....

దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా

చరణం 2:

గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు..
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్లు బ్రోచేవు
పూవునకనే నీ మతమా నేనొక్క స్త్రీ నే కదా గోపాల
అది తిలకించ కన్నులే లేవా నీ కలలే నే కాదా
అనుక్షణము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడరా....

దోబూచులాటేలరా గోపాలా నా మనసంత నీవేనురా

pallavi:

dobūsulāḍelarā gobālā nā manasaṁta nīvenurā
dobūsulāḍelarā gobāla nā manasaṁta nīvenurā
ā eḍi gaṭṭunenaḍigā siru gāli nābi ne naḍigā
ā eḍi gaṭṭunenaḍigā siru gāli nābi ne naḍigā
āgāśhānnaḍigā badule ledu
āgāśhānnaḍigā badule ledu
sivarigi ninne sūsā hṛdayabu guḍilo sūsā
sivarigi ninne sūsā hṛdayabu guḍilo sūsā...

dobūsulāḍelarā gobāla nā manasaṁta nīvenurā

saraṇaṁ 1:

nā madi nīgŏga āḍāḍu bŏmmaya..
nā madi nīgŏga āḍāḍu bŏmmaya..
nāgiga āśhalu verevi levaya ĕda lolo dāgadayā
nī adharālu aṁdiṁcha rā.. gobālā
ā....
nī adharālu aṁdiṁcha rā.. gobālā
nī kaugililo karigiṁcharā nī tanuve iga nā vĕlluvā
pālagaḍali nāḍi nā gānaṁ nī vannĕ māraledemi
pālagaḍali nāḍi nā gānaṁ nī vannĕ māraledemi
nā yĕdalo seri vannĕ mārsugo ūbiri nīvai ne sāga
pĕdavula mĕrubu nuvu kāga seraga rā....

dobūsulāḍelarā gobāla nā manasaṁta nīvenurā

saraṇaṁ 2:

gaganame varṣhiṁcha giri nĕtti kāsāvu..
gaganame varṣhiṁcha giri nĕtti kāsāvu
nayanālu varṣhiṁcha nannĕṭlu brosevu
pūvunagane nī madamā nenŏkka strī ne kadā gobāla
adi tilagiṁcha kannule levā nī kalale ne kādā
anukṣhaṇamu ulige nā manasu arĕ mūga kādu nā vayasu
nā ūbirilona ūbiri nīvai prāṇaṁ ponīguṁḍa ĕbuḍū nīve aṁḍa kābāḍarā....

dobūsulāḍelarā gobālā nā manasaṁta nīvenurā