దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయఁడు
(॥పల్లవి॥)
దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయఁడు
కొమ్మని వరము లిచ్చీఁ గొండలరాయఁడు
(॥దిమ్మ॥)
గద్దెమీఁద నల్లవాఁడే కంటిరటే చెలులాల
పొద్దొక సింగారాల భోగరాయఁడు
యిద్దరు సతులమీఁదా నిమ్ములఁ జేతులు చాఁచి
సుద్దులు చెప్పీఁగదే సుగుడరాయఁడు
(॥దిమ్మ॥)
నిక్కిచూచీ నేఁటికో నెలఁత లదేమనరే
చక్కనిమోవినవ్వులజాణరాయఁడు
వెక్కసపు రాజసాన విఱ్ఱవీఁగీఁ గొలువులో
చెక్కుల చెమటతోడ చెలువరాయఁడు
(॥దిమ్మ॥)
మెండగు కళల మేని మెఱుఁగులు చల్లీని
నిండు సరసముల కోనేటిరాయఁడు
దండిగా నురము మీఁది తరుణికాఁగిట వాఁడే
వెండి పైఁడి మేడలో శ్రీవేంకటరాయఁడు
(||pallavi||)
dimmarimāḍa lāḍīne timmarāyam̐ḍu
kŏmmani varamu lichchīm̐ gŏṁḍalarāyam̐ḍu
(||dimma||)
gaddĕmīm̐da nallavām̐ḍe kaṁṭiraḍe sĕlulāla
pŏddŏga siṁgārāla bhogarāyam̐ḍu
yiddaru sadulamīm̐dā nimmulam̐ jedulu sām̐si
suddulu sĕppīm̐gade suguḍarāyam̐ḍu
(||dimma||)
nikkisūsī nem̐ṭigo nĕlam̐ta lademanare
sakkanimovinavvulajāṇarāyam̐ḍu
vĕkkasabu rājasāna viṭravīm̐gīm̐ gŏluvulo
sĕkkula sĕmaḍadoḍa sĕluvarāyam̐ḍu
(||dimma||)
mĕṁḍagu kaḽala meni mĕṟum̐gulu sallīni
niṁḍu sarasamula koneḍirāyam̐ḍu
daṁḍigā nuramu mīm̐di taruṇigām̐giḍa vām̐ḍe
vĕṁḍi paim̐ḍi meḍalo śhrīveṁkaḍarāyam̐ḍu