దేవదుందుభులు నలుదిక్కులందు
(॥పల్లవి॥)
దేవదుందుభులు నలుదిక్కులందు
తావులనే వేవేలు ధ్వనులియ్యఁగాను
(॥దేవ॥)
వేంకటాద్రిదేవుఁడదే వేడుకతోఁ బెండ్లాడీ
లంకెల నిప్పుడే కమలాదేవిని
కొంకక ముప్పదిమూఁడుగోట్లు దేవతలాల
వుంకువ విచ్చేయరో మహోత్సవవేళ
(॥దేవ॥)
వనజనాభుఁడు నిత్యవైభవానఁ జేకొనె
అనయము నిదివో యాదిలక్ష్మిని
మునులాల భుషులాల ముంచినభూసరలాల
సొనిసి యిందరుఁగూడి సుముహూర్త మనరో
(॥దేవ॥)
సురకన్యలాల భూసురనాగకన్యలాల
మరిగికూడీ నలమేలుమంగ నితఁడు
నిరతి శ్రీవేంకటనిలయుని నీకెను
యిరవుగ దీవించి యిందరునుఁ బాడరో
(||pallavi||)
devaduṁdubhulu naludikkulaṁdu
tāvulane vevelu dhvanuliyyam̐gānu
(||deva||)
veṁkaḍādridevum̐ḍade veḍugadom̐ bĕṁḍlāḍī
laṁkĕla nippuḍe kamalādevini
kŏṁkaga muppadimūm̐ḍugoṭlu devadalāla
vuṁkuva vichcheyaro mahotsavaveḽa
(||deva||)
vanajanābhum̐ḍu nityavaibhavānam̐ jegŏnĕ
anayamu nidivo yādilakṣhmini
munulāla bhuṣhulāla muṁchinabhūsaralāla
sŏnisi yiṁdarum̐gūḍi sumuhūrda manaro
(||deva||)
suraganyalāla bhūsuranāgaganyalāla
marigigūḍī nalamelumaṁga nidam̐ḍu
niradi śhrīveṁkaḍanilayuni nīgĕnu
yiravuga dīviṁchi yiṁdarunum̐ bāḍaro