దేవ దేవ జగన్నాథ దివ్యమూరితి
(॥పల్లవి॥)
దేవ దేవ జగన్నాథ దివ్యమూరితి
చేవదేరే సింగారాన చిత్తగించు మిఁకను
(॥దేవ॥)
కలికి పిఱుఁదు నీకు ఘనచక్రముల తేరు
బలుచనుగుబ్బల పైఁడి కుండలు
అలరిననడపులె హంసవాహనములు
కెలన నీకెఁగైకొని గెలుపుము మరుని
(॥దేవ॥)
వరుస మించుఁ బయ్యద వ్రాతలపెనుటెక్కెము
యిరుదెసల చెక్కులె యివె యద్దాలు
మొరయుగంటలతోడిమొలనూల్లె పగ్గములు
వరగ నీకెఁ బెండ్లాడి పచారించు పంతము
(॥దేవ॥)
కొదలేనిహారమచే కుచ్చుల పూదండలు
చదల నలమేల్మంగే సామ్రాజ్యము
యెదుట శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
వదలక మన్నించి వన్నెకెక్కు రతుల
(||pallavi||)
deva deva jagannātha divyamūridi
sevadere siṁgārāna sittagiṁchu mim̐kanu
(||deva||)
kaligi piṟum̐du nīgu ghanasakramula teru
balusanugubbala paim̐ḍi kuṁḍalu
alarinanaḍabulĕ haṁsavāhanamulu
kĕlana nīgĕm̐gaigŏni gĕlubumu maruni
(||deva||)
varusa miṁchum̐ bayyada vrādalabĕnuḍĕkkĕmu
yirudĕsala sĕkkulĕ yivĕ yaddālu
mŏrayugaṁṭaladoḍimŏlanūllĕ paggamulu
varaga nīgĕm̐ bĕṁḍlāḍi pasāriṁchu paṁtamu
(||deva||)
kŏdalenihāramase kuchchula pūdaṁḍalu
sadala nalamelmaṁge sāmrājyamu
yĕduḍa śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
vadalaga manniṁchi vannĕgĕkku radula