Deegoni ninnidu tittudurugaaga

దీకొని నిన్నిటు తిట్టుదురుగాక
Language

(॥పల్లవి॥)
దీకొని నిన్నిటు తిట్టుదురుగాక
బూకలుగా మరి పొగడేరా

(॥దీకొ॥)
నీతో సరసము నేర్చినవారికి
యేతులు నమరును యెట్టయినా
పోతరంపువెడపొరుగుగొల్లెతలు
నీతులవినయము నెరపేరా

(॥దీకొ॥)
సూడిదె నవ్వులు చుట్టపువారికి
యీడుగఁ జెల్లునుయెట్టయినా
దూడల యావులదొడ్డివనిత లిటు
పాడిపంతమునఁ బలికేరా

(॥దీకొ॥)
సందడిరతు లివి చదివిన వారికి
యెందున దెలుసును యెట్టయినా
అందపు శ్రీవేంకటాధిప మంకులు
విందులఁ గలయకవిడిచేరా

(||pallavi||)
dīgŏni ninniḍu tiṭṭudurugāga
būgalugā mari pŏgaḍerā

(||dīgŏ||)
nīdo sarasamu nersinavārigi
yedulu namarunu yĕṭṭayinā
podaraṁpuvĕḍabŏrugugŏllĕdalu
nīdulavinayamu nĕraberā

(||dīgŏ||)
sūḍidĕ navvulu suṭṭabuvārigi
yīḍugam̐ jĕllunuyĕṭṭayinā
dūḍala yāvuladŏḍḍivanida liḍu
pāḍibaṁtamunam̐ baligerā

(||dīgŏ||)
saṁdaḍiradu livi sadivina vārigi
yĕṁduna dĕlusunu yĕṭṭayinā
aṁdabu śhrīveṁkaḍādhiba maṁkulu
viṁdulam̐ galayagaviḍiserā