Dayagalavaamdavu tappanijaanamdavu

దయగలవాఁడవు తప్పనిజాణఁడవు
Language

(॥పల్లవి॥)
దయగలవాఁడవు తప్పనిజాణఁడవు
ప్రియముల జగడాలు పెంతురా నీవు

(॥దయ॥)
కన్ను గీఁటినవాఁడవు కై కోక నుండనేల
చిన్నఁ బోయీఁజెలి నింతసేతురా నీవు
వెన్నేలరేకులవలె వెదచల్లెఁ జూపు నీపై
చిన్నదాన నేఁచ నింత చెల్లునా నీకు

(॥దయ॥)
కాలఁ జిమ్మినవాఁడవు కడకు రమ్మననేలే
యీలేమ సిగ్గుపడీ నింతకోపునా
రాలేటిపుప్పొడివలె రాలిచీ ముద్దుమాటలు
గొల నింత సేసేది గుణమా నీకు

(॥దయ॥)
చేయివేసినవాఁడవు చిత్తము పరాకేల
యీ యింతి నిను నవ్వీ నిట్టిదాఁ నీవు
చాయల శ్రీవేంకటేశ సతి నిట్టె కూడితిని
పాయపు మగువతోడఁ బంతమా నీకు

(||pallavi||)
dayagalavām̐ḍavu tappanijāṇam̐ḍavu
priyamula jagaḍālu pĕṁturā nīvu

(||daya||)
kannu gīm̐ṭinavām̐ḍavu kai koga nuṁḍanela
sinnam̐ boyīm̐jĕli niṁtasedurā nīvu
vĕnnelaregulavalĕ vĕdasallĕm̐ jūbu nībai
sinnadāna nem̐sa niṁta sĕllunā nīgu

(||daya||)
kālam̐ jimminavām̐ḍavu kaḍagu rammananele
yīlema siggubaḍī niṁtagobunā
rāleḍibuppŏḍivalĕ rālisī muddumāḍalu
gŏla niṁta sesedi guṇamā nīgu

(||daya||)
seyivesinavām̐ḍavu sittamu parāgela
yī yiṁti ninu navvī niṭṭidām̐ nīvu
sāyala śhrīveṁkaḍeśha sadi niṭṭĕ kūḍidini
pāyabu maguvadoḍam̐ baṁtamā nīgu