Dayagalavaadu taanu tappu lemtive

దయగలవాడు తాను తప్పు లేఁటివే
Language

(॥పల్లవి॥)
దయగలవాడు తాను తప్పు లేఁటివే
నయగారి తనముల నవ్వింతుఁగాక

(॥దయ॥)
తలఁపెల్లఁ దానె తనకేఁటి విన్నపము
చెలఁగి తాఁ జేసినట్టు చేసుగాక
చెలువలేమి చెప్పేరు చేతఁ జిక్కెనిదె ముద్ర
వెలలేని వేడుకల వేగింతు గాక

(॥దయ॥)
పనులెల్లఁ దానె పట్టి పెనఁగేదేది
చనవిచ్చిన కొలఁది జరపుఁగాక
ననుపులేమెంచేము నాలుకనున్నది పేరు
కనుకలి వినుకలిఁ గైకొందుఁ గాక

(॥దయ॥)
కాఁగి లెల్లఁ దానె కందువకుఁ దీసేదేమి
మాఁగిన మోవితీపులు మరుపుఁగాక
చేఁగ దేరేదేమి తానె శ్రీ వేంకటేశుఁడు గూడె
వీఁగనిరతిఁ జొక్కించి వెలయించుఁగాక

(||pallavi||)
dayagalavāḍu tānu tappu lem̐ṭive
nayagāri tanamula navviṁtum̐gāga

(||daya||)
talam̐pĕllam̐ dānĕ tanagem̐ṭi vinnabamu
sĕlam̐gi tām̐ jesinaṭṭu sesugāga
sĕluvalemi sĕpperu sedam̐ jikkĕnidĕ mudra
vĕlaleni veḍugala vegiṁtu gāga

(||daya||)
panulĕllam̐ dānĕ paṭṭi pĕnam̐gededi
sanavichchina kŏlam̐di jarabum̐gāga
nanubulemĕṁchemu nāluganunnadi peru
kanugali vinugalim̐ gaigŏṁdum̐ gāga

(||daya||)
kām̐gi lĕllam̐ dānĕ kaṁduvagum̐ dīsedemi
mām̐gina movidībulu marubum̐gāga
sem̐ga deredemi tānĕ śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
vīm̐ganiradim̐ jŏkkiṁchi vĕlayiṁchum̐gāga