(॥పల్లవి॥)
దంటమనసుగల తనకేమే వెను-
వెంట నబలఁ గన వెరచీఁ(చే?) గాక
(॥దంట॥)
మరు గురుఁడట తా మరువిరిశరములు
ధరఁ దను నేఁచవు తనకేమే
విరులే కొయుచు వేయుచు ముడిచేటి -
తరుణులముగనక తడవీఁగాక
(॥దంట॥)
వెడశశిబావట వెన్నెలయెండలు
తడవవు తను నిఁకఁ దనకేమే
జడియుచు మోముల చందురుగెలిచేటి-
పడఁతులముగనక పరచీఁగాక
(॥దంట॥)
యేఁకట వాయుజు నేలెఁగనక తనుఁ
దాఁకదు వాయువు దనకేమే
కాఁకదేర శ్రీవేంకటపతి తా నన్నేలె
వేఁకపుగిరికుచఁ గన విసరీఁగాక
(||pallavi||)
daṁṭamanasugala tanageme vĕnu-
vĕṁṭa nabalam̐ gana vĕrasīm̐(se?) gāga
(||daṁṭa||)
maru gurum̐ḍaḍa tā maruviriśharamulu
dharam̐ danu nem̐savu tanageme
virule kŏyusu veyusu muḍiseḍi -
taruṇulamuganaga taḍavīm̐gāga
(||daṁṭa||)
vĕḍaśhaśhibāvaḍa vĕnnĕlayĕṁḍalu
taḍavavu tanu nim̐kam̐ danageme
jaḍiyusu momula saṁdurugĕliseḍi-
paḍam̐tulamuganaga parasīm̐gāga
(||daṁṭa||)
yem̐kaḍa vāyuju nelĕm̐ganaga tanum̐
dām̐kadu vāyuvu danageme
kām̐kadera śhrīveṁkaḍabadi tā nannelĕ
vem̐kabugirigusam̐ gana visarīm̐gāga