దక్కినంతే చాలదా తమక మంతేశాల
(॥పల్లవి॥)
దక్కినంతే చాలదా తమక మంతేశాల
కక్కసాన యింతలేసి కతలేలే తనకు
(॥దక్కి॥)
మన తన కిచ్చితి మాటలు నే నాడఁగాని
వినయ మేఁటికిఁ జేసీ విడుమనవె
చనవు దనకిచ్చితి సరసములాడఁగాని
ననుపుల యింతలేసి నవ్వులేలె తనకు
(॥దక్కి॥)
గక్కనఁ బ్రాణ మిచ్చితి కాయ మంటనియ్యఁగాని
తక్కినబాస లింతేల తలమనవే
చక్కఁజూడనిచ్చితిని సమకూడరాఁ గాని
వక్కణించి పేరఁ బిలువఁగనేలే తరకు
(॥దక్కి॥)
సేసనవెట్టనిచ్చితిని జీరదియ్యనియ్యఁ గాని
వాసులెక్కించేపంతము వలదనవే
యీసుదీర శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
ఆసల రతికిఁ జొచ్చి అలుపేలే తనకు
(||pallavi||)
dakkinaṁte sāladā tamaga maṁteśhāla
kakkasāna yiṁtalesi kadalele tanagu
(||dakki||)
mana tana kichchidi māḍalu ne nāḍam̐gāni
vinaya mem̐ṭigim̐ jesī viḍumanavĕ
sanavu danagichchidi sarasamulāḍam̐gāni
nanubula yiṁtalesi navvulelĕ tanagu
(||dakki||)
gakkanam̐ brāṇa michchidi kāya maṁṭaniyyam̐gāni
takkinabāsa liṁtela talamanave
sakkam̐jūḍanichchidini samagūḍarām̐ gāni
vakkaṇiṁchi peram̐ biluvam̐ganele taragu
(||dakki||)
sesanavĕṭṭanichchidini jīradiyyaniyyam̐ gāni
vāsulĕkkiṁchebaṁtamu valadanave
yīsudīra śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
āsala radigim̐ jŏchchi alubele tanagu