Daggaride nim(nim)tasese taa nademe

దగ్గరితే నిఁ(నిం)తసేసె తా నదేమే
Language

(॥పల్లవి॥)
దగ్గరితే నిఁ(నిం)తసేసె తా నదేమే
యెగ్గుసిగ్గు లెంచఁ జోటు ఇందులో నేదే

(॥దగ్గ॥)
తక్కించి పొరుగునను తాను నేను వుండఁగానే
చెక్కిటికి చేయివచ్చె సేసేదేమే
కక్కసించి రాకపోక కన్నుల నే చూడఁగాను
లక్కవంటిమనసాయ లాగు నిఁక నేలే

(॥దగ్గ॥)
తామ నేను నొక్కవీది తగ నడచినంతేనే
మానుపడె మేనెల్లా మరిఁకనేమే
నానుపుగా తానునేను నవ్విన యంతటిలోనే
తానకమాయ వలపు తారుకాణ లేలే

(॥దగ్గ॥)
తలపోసి తలపోసి దగ్గిరినయంతలోనే
కలసె కాఁగిట నన్నుఁ గత లేలే
చెలఁగి శ్రీ వేంకటేశు చేరినఫలములాయ
నిలువే నివ్వెరగాయ నేర మెంచనేలే

(||pallavi||)
daggaride nim̐(niṁ)tasesĕ tā nademe
yĕggusiggu lĕṁcham̐ joḍu iṁdulo nede

(||dagga||)
takkiṁchi pŏrugunanu tānu nenu vuṁḍam̐gāne
sĕkkiḍigi seyivachchĕ sesedeme
kakkasiṁchi rāgaboga kannula ne sūḍam̐gānu
lakkavaṁṭimanasāya lāgu nim̐ka nele

(||dagga||)
tāma nenu nŏkkavīdi taga naḍasinaṁtene
mānubaḍĕ menĕllā marim̐kaneme
nānubugā tānunenu navvina yaṁtaḍilone
tānagamāya valabu tārugāṇa lele

(||dagga||)
talabosi talabosi daggirinayaṁtalone
kalasĕ kām̐giḍa nannum̐ gada lele
sĕlam̐gi śhrī veṁkaḍeśhu serinaphalamulāya
niluve nivvĕragāya nera mĕṁchanele