దానికేమి దోసమా తాను నేను నొకటయితే
(॥పల్లవి॥)
దానికేమి దోసమా తాను నేను నొకటయితే
మోనాననుండి చూచితే మొద లేరుపడదు
(॥దాని॥)
చలములేనివలపు సాదించవసమా
అలయిక బెట్టనుచు నందురుగాక
తెలిసినవారికే దిష్టమై వుండఁగాను
కొలఁది వెట్టఁగఁ బోతే గురిగా దొకటియు
(॥దాని॥)
ననుపుగాని పొందు నవ్వించవసమా
అనఁగి పెనఁగుమని యందురు గాక
విన నేర్చినవారే పనిగొన నేర్తురు
కినిసి మొక్కఁగఁబోతే కిందుపడు బనులు
(॥దాని॥)
గక్కనఁ గూడినమీఁద కాతరించవసమా
అక్కరదీర వలెననెందురు గాక
యిక్కువ శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
తక్కినవి దడవితే తడఁబడీ మనసు
(||pallavi||)
dānigemi dosamā tānu nenu nŏgaḍayide
monānanuṁḍi sūside mŏda lerubaḍadu
(||dāni||)
salamulenivalabu sādiṁchavasamā
alayiga bĕṭṭanusu naṁdurugāga
tĕlisinavārige diṣhṭamai vuṁḍam̐gānu
kŏlam̐di vĕṭṭam̐gam̐ bode gurigā dŏgaḍiyu
(||dāni||)
nanubugāni pŏṁdu navviṁchavasamā
anam̐gi pĕnam̐gumani yaṁduru gāga
vina nersinavāre panigŏna nerduru
kinisi mŏkkam̐gam̐bode kiṁdubaḍu banulu
(||dāni||)
gakkanam̐ gūḍinamīm̐da kādariṁchavasamā
akkaradīra valĕnanĕṁduru gāga
yikkuva śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
takkinavi daḍavide taḍam̐baḍī manasu