Buddiseppemu neegu puttinayimtivaaramu

బుద్దిచెప్పేము నీకు పుట్టినయింటివారము
Language

(॥పల్లవి॥)
బుద్దిచెప్పేము నీకు పుట్టినయింటివారము
పొద్దువొద్దు మగనికి పొందులు మరుపవే

(॥బుద్ది॥)
గుత్తపు గుబ్బల నూఁది కొప్పు దువ్వవే పతి -
చిత్తమురా వేళగాచి సేవ సేయవే
హత్తి ఇచ్చకపుమాఁట లాడి పైకోవే
కొత్తపెండ్లికూఁతుర యాగుణాలెఱుఁ గుకోవే

(॥బుద్ది॥)
వినయాలు చూపి చూపి వీడె మియ్యవే
ననుపులు సేసుకొని నవ్వు నవ్వవే
తనివారా భోగమిచ్చి తమిరేఁచవే
వొనరినకొమెరెవు వోజ నేరుచుకోవే

(॥బుద్ది॥)
మోవితేనియ లోసఁగి మోము చూడవే
శ్రీవేంకటేశుఁ గూడి చెలగించవే
కైవసముగ మెలఁగి కాఁగిలించవే
యావల నలమేల్మంగ విన్నీఁ దెలుసుకోవే

(||pallavi||)
buddisĕppemu nīgu puṭṭinayiṁṭivāramu
pŏdduvŏddu maganigi pŏṁdulu marubave

(||buddi||)
guttabu gubbala nūm̐di kŏppu duvvave padi -
sittamurā veḽagāsi seva seyave
hatti ichchagabumām̐ṭa lāḍi paigove
kŏttabĕṁḍligūm̐tura yāguṇālĕṟum̐ gugove

(||buddi||)
vinayālu sūbi sūbi vīḍĕ miyyave
nanubulu sesugŏni navvu navvave
tanivārā bhogamichchi tamirem̐save
vŏnarinagŏmĕrĕvu voja nerusugove

(||buddi||)
movideniya losam̐gi momu sūḍave
śhrīveṁkaḍeśhum̐ gūḍi sĕlagiṁchave
kaivasamuga mĕlam̐gi kām̐giliṁchave
yāvala nalamelmaṁga vinnīm̐ dĕlusugove