బుద్దిచెప్పవయ్యా నీపొలఁతికిని
(॥పల్లవి॥)
బుద్దిచెప్పవయ్యా నీపొలఁతికిని
ఇద్దరికి సరేకావా యెన్నుకొన్న సిగ్గులు
(॥బుద్ది॥)
మంచముమీఁద మనము మాటలాడఁగా
పొంచులు దా వినెనట పొలఁతొకతె
వంచన లే కాసుద్దులు వారివీరితోఁ జెప్పి
కంచుఁబెంచు సేసి అట్టె కాకుసేసె నదివో
(॥బుద్ది॥)
పీఁటమీఁద నిద్దరము పెనఁగులాడఁగాను
మాఁటుననే చూచెనట మరియొకతె
గాఁటముగ నాపనులు కన్నవారితోఁ జెప్పి
చాటుచుసారెసారె జాతులఁబెట్టీని
(॥బుద్ది॥)
యెంగిలిమోవిచ్చి పన్ను ఇంటిలోఁ గూడినది
ఇంగిత మెఱిఁగెనట ఇదియెకతె
అంగపుశ్రీవేంకటేశ అందిరతో నాడుకొని
రంగుమీర నంతటాను రవ్వలు సేసీని
(||pallavi||)
buddisĕppavayyā nībŏlam̐tigini
iddarigi saregāvā yĕnnugŏnna siggulu
(||buddi||)
maṁchamumīm̐da manamu māḍalāḍam̐gā
pŏṁchulu dā vinĕnaḍa pŏlam̐tŏgadĕ
vaṁchana le kāsuddulu vārivīridom̐ jĕppi
kaṁchum̐bĕṁchu sesi aṭṭĕ kāgusesĕ nadivo
(||buddi||)
pīm̐ṭamīm̐da niddaramu pĕnam̐gulāḍam̐gānu
mām̐ṭunane sūsĕnaḍa mariyŏgadĕ
gām̐ṭamuga nābanulu kannavāridom̐ jĕppi
sāḍususārĕsārĕ jādulam̐bĕṭṭīni
(||buddi||)
yĕṁgilimovichchi pannu iṁṭilom̐ gūḍinadi
iṁgida mĕṟim̐gĕnaḍa idiyĕgadĕ
aṁgabuśhrīveṁkaḍeśha aṁdirado nāḍugŏni
raṁgumīra naṁtaḍānu ravvalu sesīni