బుద్దెడిగే నిను నేను బోదించ నేరుతువు
(॥పల్లవి॥)
బుద్దెడిగే నిను నేను బోదించ నేరుతువు
యిద్దరము నున్నారము యేమందురా
(॥బుద్దె॥)
పలుమాట లాడితేను బహుభాషి నందువు
మలసి కోపించితేను మంక నందువు
అలిగితే నీతోడి అంకెకత్తె నందువు
యెలమి నీతోడి గాడ కేమిసేతురా
(॥బుద్దె॥)
కన్నుల జంకించితేను గయ్యాలి నందువు
చన్నుల నే వొత్తిచే చలమందువు
సన్నల చేసితే నీతో సటలు చూపె నందువు
యెన్ని లేవు నీసుద్దు లిటువంటివేరా
(॥బుద్దె॥)
అట్టె కాఁగిలించుకొంటే ఆసకత్తె నందువు
గుట్టున నూరకుండితే గొంట నందువు
నెట్టుక శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గూడితివి
యిట్టిదివో నీ నేరువు యెదురాడరా
(||pallavi||)
buddĕḍige ninu nenu bodiṁcha neruduvu
yiddaramu nunnāramu yemaṁdurā
(||buddĕ||)
palumāḍa lāḍidenu bahubhāṣhi naṁduvu
malasi kobiṁchidenu maṁka naṁduvu
aligide nīdoḍi aṁkĕgattĕ naṁduvu
yĕlami nīdoḍi gāḍa kemisedurā
(||buddĕ||)
kannula jaṁkiṁchidenu gayyāli naṁduvu
sannula ne vŏttise salamaṁduvu
sannala seside nīdo saḍalu sūbĕ naṁduvu
yĕnni levu nīsuddu liḍuvaṁṭiverā
(||buddĕ||)
aṭṭĕ kām̐giliṁchugŏṁṭe āsagattĕ naṁduvu
guṭṭuna nūraguṁḍide gŏṁṭa naṁduvu
nĕṭṭuga śhrīveṁkaḍeśha nīve nannum̐ gūḍidivi
yiṭṭidivo nī neruvu yĕdurāḍarā