Bonamu vattugumdaana poddunu jaamekkenu

బోనము వట్టుకుందాన పొద్దును జామెక్కెను
Language

(॥పల్లవి॥)
బోనము వట్టుకుందాన పొద్దును జామెక్కెను
తానేమి సేసీనో తలఁపించరే

(॥బొన॥)
యెప్పుడు వచ్చునోయంటా యెదురుచూచే నేను
కప్పురవిడె మందుక కాచుకుందాన
ఇప్పుడే వచ్చేననె యేడ పరాకై వున్నాఁడో
చెప్పరే యాతవికిని చెలులాల మీరు

(॥బొన॥)
ఆరతి యెత్తేనంటా నాఇత్తమైవుందాన
కోరి పీఁటవెట్టుకొని కూచుందానను
చేరి యిందాఁకా వేగిరించె నాడ నేమిసేసీనొ
యీరీతులు చెలులాల యెచ్చరించరే

(॥బొన॥)
తలుపు దెరుచుక వుందాన నూడిగపుదాన
లలి శ్రీవేంకటేశు కలమేల్మంగకు
నిలిచె వాకిట వచ్చి నేఁడితఁడె మన్నించె
పిలువరే చెలులాల ప్రేమతో లోనికిని

(||pallavi||)
bonamu vaṭṭuguṁdāna pŏddunu jāmĕkkĕnu
tānemi sesīno talam̐piṁchare

(||bŏna||)
yĕppuḍu vachchunoyaṁṭā yĕdurusūse nenu
kappuraviḍĕ maṁduga kāsuguṁdāna
ippuḍe vachchenanĕ yeḍa parāgai vunnām̐ḍo
sĕppare yādavigini sĕlulāla mīru

(||bŏna||)
āradi yĕttenaṁṭā nāittamaivuṁdāna
kori pīm̐ṭavĕṭṭugŏni kūsuṁdānanu
seri yiṁdām̐kā vegiriṁchĕ nāḍa nemisesīnŏ
yīrīdulu sĕlulāla yĕchchariṁchare

(||bŏna||)
talubu dĕrusuga vuṁdāna nūḍigabudāna
lali śhrīveṁkaḍeśhu kalamelmaṁgagu
nilisĕ vāgiḍa vachchi nem̐ḍidam̐ḍĕ manniṁchĕ
piluvare sĕlulāla premado lonigini