Bommanu geeste ...

బొమ్మను గీస్తే ...
Work
Year
Language

పల్లవి:

బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చీ ఓ ముద్దిమ్మందీ
సర్లే పాపం అని దగ్గరికెళితే
దాని మనసే నీలో ఉందందీ, ఆ ముద్దేదో నీకే ఇమ్మందీ

సరసాలాడే వయసొచ్చిందీ, సరదాపడితే తప్పేముందీ
ఇవ్వాలనే నాకూ ఉందీ
కానీ సిగ్గే నన్నూ ఆపిందీ, దానికి సమయం వేరే ఉందందీ

చరణం 1:

చలిగాలీ అంది ... చెలికి ఒణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా ... నిను అల్లుకుపొమ్మందీ

చలినే తరిమేసే ... ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడి పోకండీ ...తమ సాయం వద్దండీ

పొమ్మంటావె బాలికా ... ఉంటానంటే తోడుగా

అబ్బో ఎంత జాలిరా ... తమరికి నా మీద

ఏం చెయ్యాలమ్మా ... నీలో ఏదో దాగుందీ
నీ వైపే నన్నే లాగిందీ

చరణం 2:

అందంగా ఉంది ... తన వెంటే పది మంది
పడకుండా చూడూ ... అని నా మనసంటుందీ

తమకే తెలియందీ ... నా తోడై ఒకటుందీ
మరెవరో కాదండీ ... అది నా నీడేనండీ

నీతో నడిచి దానికీ ... అలుపొస్తుందే జానకీ
హయ్యో అలక దేనికీ ... నా నీడవు నువ్వేగా

ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచుందీ
నా మనసు ఎన్నో కలలే కంటుందీ

బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చీ ఓ ముద్దిమ్మందీ
సర్లే పాపం అని దగ్గరికెళితే
దాని మనసే నీలో ఉందందీ, ఆ ముద్దేదో నీకే ఇమ్మందీ
దాని మనసే నీలో ఉందందీ, ఆ ముద్దేదో నీకే ఇమ్మందీ...

pallavi:

bŏmmanu gīste nīlā uṁdi, daggaragŏchchī o muddimmaṁdī
sarle pābaṁ ani daggarigĕḽide
dāni manase nīlo uṁdaṁdī, ā muddedo nīge immaṁdī

sarasālāḍe vayasŏchchiṁdī, saradābaḍide tappemuṁdī
ivvālane nāgū uṁdī
kānī sigge nannū ābiṁdī, dānigi samayaṁ vere uṁdaṁdī

saraṇaṁ 1:

saligālī aṁdi ... sĕligi ŏṇuge puḍuduṁdi
vĕchchani kaugiligā ... ninu allugubŏmmaṁdī

saline tarimese ... ā kiḍuge tĕlusaṁḍī
śhrama paḍi pogaṁḍī ...tama sāyaṁ vaddaṁḍī

pŏmmaṁṭāvĕ bāligā ... uṁṭānaṁṭe toḍugā

abbo ĕṁta jālirā ... tamarigi nā mīda

eṁ sĕyyālammā ... nīlo edo dāguṁdī
nī vaibe nanne lāgiṁdī

saraṇaṁ 2:

aṁdaṁgā uṁdi ... tana vĕṁṭe padi maṁdi
paḍaguṁḍā sūḍū ... ani nā manasaṁṭuṁdī

tamage tĕliyaṁdī ... nā toḍai ŏgaḍuṁdī
marĕvaro kādaṁḍī ... adi nā nīḍenaṁḍī

nīdo naḍisi dānigī ... alubŏstuṁde jānagī
hayyo alaga denigī ... nā nīḍavu nuvvegā

ī māḍa kosaṁ innāḽḽugā vesuṁdī
nā manasu ĕnno kalale kaṁṭuṁdī

bŏmmanu gīste nīlā uṁdi, daggaragŏchchī o muddimmaṁdī
sarle pābaṁ ani daggarigĕḽide
dāni manase nīlo uṁdaṁdī, ā muddedo nīge immaṁdī
dāni manase nīlo uṁdaṁdī, ā muddedo nīge immaṁdī...