Bharada vedamuga nirada naatyamuga

భరత వేదముగ నిరత నాట్యముగ
Work
Year
Language

పల్లవి:

శంభో.. శంకర
హరహర మహాదేవ హరహర మహాదేవ
హరహర మహాదేవ హర హర మాహాదేవ

తధ్ధింతాధింధింధిమీ పరుల తాండవకేళీతత్పర
గౌరీమంజుల సింజిణీ జతుల లాస్య వినోదవ శంకరా

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా
నీలకంఠరా జాలిపొందరా కరుణతొ నను గనరా
నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా ఫాలేందు శేఖరా శంకరా

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా

చరణం 1:

ఓ... ఓ... ఓ...
హరహర మాహాదేవ హరహర మాహాదేవ
హరహర మాహాదేవ హరహర మాహాదేవ

ఆ ఆ ఆ ఆ...

అంతకాంత నీ సతి అగ్నితప్తమైనదీ మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ..
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నదీ

హా... ఆ... ఆ... ఆ...

భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళా

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా

ఓ... ఓ... ఓ...

జంగమ సావర గంగాచ్యుత శిర మృతమండితకర పురహరా
భక్త శుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
ఫాలవిలోచన పాలిత జనగణ కాలకాల విశ్వేశ్వరా
ఆశుతోష అధనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

హరహర మాహాదేవ హరహర మాహాదేవ

చరణం 2:

ఓం.. ఓం... ఓం... ఓం...
ఓం నమఃశ్శివాయ ఓం నమఃశ్శివాయ ఓం నమఃశ్శివాయ ఓం నమఃశ్శివాయ
ఓం నమఃశ్శివాయ ఓం నమఃశ్శివాయ ఓం నమఃశ్శివాయ ఓం నమఃశ్శివాయ

వ్యోమకేశ నిను హిమగిరివరసుత ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్య శోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోనా

నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రధమనాద శృతివినరా

హరహర మాహాదేవ

pallavi:

śhaṁbho.. śhaṁkara
harahara mahādeva harahara mahādeva
harahara mahādeva hara hara māhādeva

tadhdhiṁtādhiṁdhiṁdhimī parula tāṁḍavageḽīdatpara
gaurīmaṁjula siṁjiṇī jadula lāsya vinodava śhaṁkarā

bharada vedamuga nirada nāṭyamuga kadilina padamidi īśhā
śhiva nivedanaga avani vedanaga paligĕnu padamu pareśhā
nīlagaṁṭharā jālibŏṁdarā karuṇadŏ nanu ganarā
nīlagaṁdarā śhailamaṁdirā mŏravini baduliḍarā
nagajāmanoja jagadīśhvarā phāleṁdu śhekharā śhaṁkarā

bharada vedamuga nirada nāṭyamuga kadilina padamidi īśhā
śhiva nivedanaga avani vedanaga paligĕnu padamu pareśhā

saraṇaṁ 1:

o... o... o...
harahara māhādeva harahara māhādeva
harahara māhādeva harahara māhādeva

ā ā ā ā...

aṁtagāṁta nī sadi agnidaptamainadī menu tyāgamichchi tānu nīlo līnamainadī..
ādiśhakti ākṛti adrijāda pārvadi sthāṇuvaina prāṇadhavuni sĕṁtagu serugunnadī

hā... ā... ā... ā...

bhavuni bhuvigi taraliṁchelā dharaṇi divini talabiṁchelā
rasadaraṁgiṇīlīla yadini nṛtyaradulu seyagalige ī veḽā

bharada vedamuga nirada nāṭyamuga kadilina padamidi īśhā
śhiva nivedanaga avani vedanaga paligĕnu padamu pareśhā

o... o... o...

jaṁgama sāvara gaṁgāchyuda śhira mṛtamaṁḍidagara puraharā
bhakta śhubhaṁkara bhavanā śhaṁkara svarahara dakṣhātvaraharā
phālavilosana pālida janagaṇa kālagāla viśhveśhvarā
āśhudoṣha adhanāśha viśhāṣhaṇa jayagirīśha bṛhadīśhvarā

harahara māhādeva harahara māhādeva

saraṇaṁ 2:

oṁ.. oṁ... oṁ... oṁ...
oṁ namaḥśhśhivāya oṁ namaḥśhśhivāya oṁ namaḥśhśhivāya oṁ namaḥśhśhivāya
oṁ namaḥśhśhivāya oṁ namaḥśhśhivāya oṁ namaḥśhśhivāya oṁ namaḥśhśhivāya

vyomageśha ninu himagirivarasuda premabāśhamuna piluvaṁgā
yogiveṣha nī manasuna kalagada rāgaleśhamainā
he maheśha nī bhayadabadāhadi daitya śhoṣhaṇamu jarubaṁga
bhogibhūṣha bhuvanāḽini nilubava abhayamudralonā

namaga samagamula nādānā yamaga gamagamula yogānā
palugudunna prāṇāna praṇavanāda pradhamanāda śhṛtivinarā

harahara māhādeva