Bhali bhali bhali bhali devaa...

భళి భళి భళి భళి దేవా...
Year
Language

పల్లవి:

భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
బహు బాగున్నదయా నీ మాయా

చరణం 1:

ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో...
నీవారెవరో పై వారెవరో ఆ విధికైనను తెలియదయా .. బాగున్నదయా నీ మాయా !

చరణం 2:

సుఖదుఃఖాలతో గుంజాటనబడు లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణకథలు..
లీలలు మాయలు నీ గుణకథలు తెలిసినవారే ధన్యులయా .. బాగున్నదయా నీ మాయా !

భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
భళి భళి భళి భళి దేవా... ఆ... బాగున్నదయా నీ మాయా
బహు బాగున్నదయా నీ మాయా!!

pallavi:

bhaḽi bhaḽi bhaḽi bhaḽi devā... ā... bāgunnadayā nī māyā
bhaḽi bhaḽi bhaḽi bhaḽi devā... ā... bāgunnadayā nī māyā
bahu bāgunnadayā nī māyā

saraṇaṁ 1:

ŏgarigi khedaṁ ŏgarigi modaṁ sagalamu tĕlisina nīgu vinodaṁ
nīvārĕvaro pai vārĕvaro...
nīvārĕvaro pai vārĕvaro ā vidhigainanu tĕliyadayā .. bāgunnadayā nī māyā !

saraṇaṁ 2:

sukhaduḥkhālado guṁjāḍanabaḍu logamu nī sĕlagāḍamayā
līlalu māyalu nī guṇagathalu..
līlalu māyalu nī guṇagathalu tĕlisinavāre dhanyulayā .. bāgunnadayā nī māyā !

bhaḽi bhaḽi bhaḽi bhaḽi devā... ā... bāgunnadayā nī māyā
bhaḽi bhaḽi bhaḽi bhaḽi devā... ā... bāgunnadayā nī māyā
bahu bāgunnadayā nī māyā!!