(॥పల్లవి॥)
భావించి చూడరే పడఁతులాల
చేవదేరి మహిమలు చెలఁగినట్టుండెను
(॥భావిం॥)
పరమపురుషునికి పచ్చకప్పురముకాఁపు
తిరుమేన నమరెను తెల్లనికాంతి
ధరలోఁ బాలజలధి తచ్చేటివేళను
మురిపెమై తుంపురులు ముంచినయట్టుండెను
(॥భావిం॥)
తవిలి యీదేవునికి తట్టుపుణుఁగుకాంపు
నవమై మేన నమరె నల్లనికాంతి
తివిరి గోవర్ధనమెత్తిననాఁడు నిఁడుకొని
ధ్రువమై మేఘకాంతులు తొలఁకినట్టుండెను
(॥భావిం॥)
శ్రీవేంకటేశునికి సింగారించిన సొమ్ములు
బావించ మేన నమరే బంగారుకాంతి
తావుగా నలమేల్ మంగ తనవుర మెక్కఁగాను
వేవేలుసంపదలెల్ల వెలసినట్టుండెను
(||pallavi||)
bhāviṁchi sūḍare paḍam̐tulāla
sevaderi mahimalu sĕlam̐ginaṭṭuṁḍĕnu
(||bhāviṁ||)
paramaburuṣhunigi pachchagappuramugām̐pu
tirumena namarĕnu tĕllanigāṁti
dharalom̐ bālajaladhi tachcheḍiveḽanu
muribĕmai tuṁpurulu muṁchinayaṭṭuṁḍĕnu
(||bhāviṁ||)
tavili yīdevunigi taṭṭubuṇum̐gugāṁpu
navamai mena namarĕ nallanigāṁti
tiviri govardhanamĕttinanām̐ḍu nim̐ḍugŏni
dhruvamai meghagāṁtulu tŏlam̐kinaṭṭuṁḍĕnu
(||bhāviṁ||)
śhrīveṁkaḍeśhunigi siṁgāriṁchina sŏmmulu
bāviṁcha mena namare baṁgārugāṁti
tāvugā nalamel maṁga tanavura mĕkkam̐gānu
vevelusaṁpadalĕlla vĕlasinaṭṭuṁḍĕnu