పల్లవి:
భామనే! సత్య భామనే!
సత్య భామనే.. సత్య భామనే
సత్య భామనే..ఏ..ఏ..ఏ సత్య భామనే
వయ్యారి ముద్దుల!
వయ్యారి ముద్దుల సత్యా భామనే..ఏ
సత్య భామనే
చరణం 1:
భామనే పదియారువేల కోమలులందరిలోనా
భామనే పదియారువేల కోమలులందరిలో
లలనా! చెలియా! మగువా! సఖియా!
రామరో గోపాలదేవుని ప్రేమను దోచినదాన!
రామరో గోపాలదేవుని ప్రేమను దోచిన సత్య భామనే..ఏ..
సత్యా భామనే
చరణం 2:
ఇంతినే..ఏ, చామంతినే..ఏ.. మరుదంతినే..ఏ, విరిబంతినే..ఏ.
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే
జాణతనమున సతులలో
జాణతనమున సతులలో నెరజాణనై! నెరజాణనై!
నెరజాణనై వెలిగేటిదాన భామనే..ఏ.., సత్య భామనే!
చరణం 3:
అందమున ఆనందమున గోవిందునకు నెరవిందునై
అందమున ఆనందమున గోవిందునకు నెరవిందునై
నందనందను నెందు గానక
నందనందను యెందు గానక
డెందమందును క్రుంగుచున్న భామనే..ఏ..ఏ.. సత్య భామనే!
సత్య భామనే..ఏ.. సత్య భామనే
pallavi:
bhāmane! satya bhāmane!
satya bhāmane.. satya bhāmane
satya bhāmane..e..e..e satya bhāmane
vayyāri muddula!
vayyāri muddula satyā bhāmane..e
satya bhāmane
saraṇaṁ 1:
bhāmane padiyāruvela komalulaṁdarilonā
bhāmane padiyāruvela komalulaṁdarilo
lalanā! sĕliyā! maguvā! sakhiyā!
rāmaro gobāladevuni premanu dosinadāna!
rāmaro gobāladevuni premanu dosina satya bhāmane..e..
satyā bhāmane
saraṇaṁ 2:
iṁtine..e, sāmaṁtine..e.. marudaṁtine..e, viribaṁtine..e.
iṁtine sāmaṁtine marudaṁtine viribaṁtine
jāṇadanamuna sadulalo
jāṇadanamuna sadulalo nĕrajāṇanai! nĕrajāṇanai!
nĕrajāṇanai vĕligeḍidāna bhāmane..e.., satya bhāmane!
saraṇaṁ 3:
aṁdamuna ānaṁdamuna goviṁdunagu nĕraviṁdunai
aṁdamuna ānaṁdamuna goviṁdunagu nĕraviṁdunai
naṁdanaṁdanu nĕṁdu gānaga
naṁdanaṁdanu yĕṁdu gānaga
ḍĕṁdamaṁdunu kruṁgusunna bhāmane..e..e.. satya bhāmane!
satya bhāmane..e.. satya bhāmane