భామతోడి పొందు నీకు భాగ్యము గాదా
(॥పల్లవి॥)
భామతోడి పొందు నీకు భాగ్యము గాదా
చే ముట్టి సరసమాడి సిగ్గుదేర్చరాదా
(॥భామ॥)
కలువరేకులవంటికన్నులఁ దేలించి చూచి
మలసి సొలసి నీతో మాటలాడీని
పిలిచి వద్దఁ గూచుండఁబెట్టుకొని కాఁగిట
కలయరాదా యేల కాఁకలుసేసేవు
(॥భామ॥)
చిగురుఁదీ గెలవఁటిచేతులనే నీకు మొక్కి
నగినగి నీతోనే నంటుచూపీని
బగివాయకుండా నీవు పచ్చడము మీఁదఁ గప్పి
తగవు నెరపరాదా తడవేల సేసేవు
(॥భామ॥)
పసిడికుండలవంటిపాలిండ్ల నిన్నొరసి
కొసరి వూర్పులఁ దావికుప్పళించీని
యెసగ శ్రీవేంకటేశ యింతిఁ గూడితివి యిట్టె
వసమై యుండఁగరాదా వరుసేల సేసేవు
(||pallavi||)
bhāmadoḍi pŏṁdu nīgu bhāgyamu gādā
se muṭṭi sarasamāḍi siggudersarādā
(||bhāma||)
kaluvaregulavaṁṭigannulam̐ deliṁchi sūsi
malasi sŏlasi nīdo māḍalāḍīni
pilisi vaddam̐ gūsuṁḍam̐bĕṭṭugŏni kām̐giḍa
kalayarādā yela kām̐kalusesevu
(||bhāma||)
sigurum̐dī gĕlavam̐ṭisedulane nīgu mŏkki
naginagi nīdone naṁṭusūbīni
bagivāyaguṁḍā nīvu pachchaḍamu mīm̐dam̐ gappi
tagavu nĕrabarādā taḍavela sesevu
(||bhāma||)
pasiḍiguṁḍalavaṁṭibāliṁḍla ninnŏrasi
kŏsari vūrbulam̐ dāviguppaḽiṁchīni
yĕsaga śhrīveṁkaḍeśha yiṁtim̐ gūḍidivi yiṭṭĕ
vasamai yuṁḍam̐garādā varusela sesevu