Bhaamado nee vamdugumgaa pamtamulelaadevu

భామతో నీ వందుకుఁగా పంతములేలాడేవు
Language

(॥పల్లవి॥)
భామతో నీ వందుకుఁగా పంతములేలాడేవు
చే ముంచి మారుకుమారు చేఁత సేయఁదగదా

(॥భామ॥)
చెలరేఁగి నీ వాపెను చెనకి గోర నూఁదితే
వొలిసి గుబ్బల నిన్నొత్తఁదగదా
నలువున నూరఁగల నవ్వులెల్ల నవ్వఁగాను
కలువపూవుల నాపె కమ్మివేయఁదగదా

(॥భామ॥)
పిరిదూరి నీవాపెతో పెనఁగులాడఁగాను
కెరలి బొమ్మలను జంకించఁదగదా
తరుణులమీఁదఁబెట్టి తగనివొట్టు వెట్టఁగ
సిరులనిన్నంటఁబట్టి చెక్కునోక్కఁదగదా

(॥భామ॥)
గుట్టుతోనుండినయాపెఁ గొప్పువట్టి తడవఁగా
నెట్టనఁ గప్రము నీపై నించఁదగదా
అట్టె శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ
వొట్టి నీవు గూడఁగాను వురమెక్కఁదగదా

(||pallavi||)
bhāmado nī vaṁdugum̐gā paṁtamulelāḍevu
se muṁchi mārugumāru sem̐ta seyam̐dagadā

(||bhāma||)
sĕlarem̐gi nī vābĕnu sĕnagi gora nūm̐dide
vŏlisi gubbala ninnŏttam̐dagadā
naluvuna nūram̐gala navvulĕlla navvam̐gānu
kaluvabūvula nābĕ kammiveyam̐dagadā

(||bhāma||)
piridūri nīvābĕdo pĕnam̐gulāḍam̐gānu
kĕrali bŏmmalanu jaṁkiṁcham̐dagadā
taruṇulamīm̐dam̐bĕṭṭi taganivŏṭṭu vĕṭṭam̐ga
sirulaninnaṁṭam̐baṭṭi sĕkkunokkam̐dagadā

(||bhāma||)
guṭṭudonuṁḍinayābĕm̐ gŏppuvaṭṭi taḍavam̐gā
nĕṭṭanam̐ gapramu nībai niṁcham̐dagadā
aṭṭĕ śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga
vŏṭṭi nīvu gūḍam̐gānu vuramĕkkam̐dagadā