బెరసి పెండ్లి వచ్చి పెరట విడిసె నీకు
(॥పల్లవి॥)
బెరసి పెండ్లి వచ్చి పెరట విడిసె నీకు
సొరిదిఁ బెండ్లాడపయ్య సోబానఁ బాడేము
(॥బెర॥)
పోట్టఁబొరుగుననుండి పొంచి నీకు మోము చూపె
గుట్టుతోఁ దాఁ బండేఇంటిగురుతు చెప్పె
దట్టపుసోరణగండ్లతలుపుఁ దెరచి ఇచ్చె
చుట్టమవైతి వాపెకు సుద్దు లిఁక నేఁటికి
(॥బెర॥)
యెలుఁగెత్తి పాటవాడి యెచ్చరికెసేసి నీకు
కలపీఁ బరిమళాలు గాలివైపున
వెలిఁ బావురమువేసి పిలిచి నిన్ను సన్నల
చెలిమి చేటఁడు గల్గె చెప్పనిఁకనేఁటికి
(॥బెర॥)
ఆకె సింగారించుకొని అట్టె నిన్నుఁ దోఁగిచూచె
వాకునఁ దాఁగలసినవావి దెలిపె
పైకొని యలమేల్ మంగపతివి శ్రీవేంకటేశ
యీకడ నన్నేలితివి యేమీనననేఁటికి
(||pallavi||)
bĕrasi pĕṁḍli vachchi pĕraḍa viḍisĕ nīgu
sŏridim̐ bĕṁḍlāḍabayya sobānam̐ bāḍemu
(||bĕra||)
poṭṭam̐bŏrugunanuṁḍi pŏṁchi nīgu momu sūbĕ
guṭṭudom̐ dām̐ baṁḍeiṁṭigurudu sĕppĕ
daṭṭabusoraṇagaṁḍladalubum̐ dĕrasi ichchĕ
suṭṭamavaidi vābĕgu suddu lim̐ka nem̐ṭigi
(||bĕra||)
yĕlum̐gĕtti pāḍavāḍi yĕchcharigĕsesi nīgu
kalabīm̐ barimaḽālu gālivaibuna
vĕlim̐ bāvuramuvesi pilisi ninnu sannala
sĕlimi seḍam̐ḍu galgĕ sĕppanim̐kanem̐ṭigi
(||bĕra||)
āgĕ siṁgāriṁchugŏni aṭṭĕ ninnum̐ dom̐gisūsĕ
vāgunam̐ dām̐galasinavāvi dĕlibĕ
paigŏni yalamel maṁgabadivi śhrīveṁkaḍeśha
yīgaḍa nannelidivi yemīnananem̐ṭigi