Battigala vibhumdavu bhaamagu neevu

బత్తిగల విభుఁడవు భామకు నీవు
Language

(॥పల్లవి॥)
బత్తిగల విభుఁడవు భామకు నీవు
యిత్తల నాకె చనవు యీడేరించవయ్యా

(॥బత్తి॥)
ముప్పిరివినయముతో మోవితేనె లూరఁగాను
చెప్పీఁ బ్రియాలు నీకుఁ జెలియా
కొప్పు నిక్కఁ బెట్టుకొని కూరిములు చల్లుకొంటా
ఇప్పుడిదె నీకు మొక్కి నింటికి రావయ్యా

(॥బత్తి॥)
సెలవుల నవ్వుకొంటా చేరి చేరి బుజ్జగించి
సొలసీ సారెకు నిన్ను సుదతి
వలపులు చల్లి చల్లి వాడికలు దలపించి
పిలిచీ నాపె సంగడిఁ బీఁట యెక్కవయ్యా

(॥బత్తి॥)
సన్నలు సేసి నీకు చవులెల్లాఁ గుట్టించి
చన్నులు మోపీ నీకు సకియా
యిన్నిటా శ్రీవేంకటేశ యాకె యలమేలుమంగ
కిన్నెర వాయించీఁ గాఁగిట నించవయ్యా

(||pallavi||)
battigala vibhum̐ḍavu bhāmagu nīvu
yittala nāgĕ sanavu yīḍeriṁchavayyā

(||batti||)
muppirivinayamudo movidenĕ lūram̐gānu
sĕppīm̐ briyālu nīgum̐ jĕliyā
kŏppu nikkam̐ bĕṭṭugŏni kūrimulu sallugŏṁṭā
ippuḍidĕ nīgu mŏkki niṁṭigi rāvayyā

(||batti||)
sĕlavula navvugŏṁṭā seri seri bujjagiṁchi
sŏlasī sārĕgu ninnu sudadi
valabulu salli salli vāḍigalu dalabiṁchi
pilisī nābĕ saṁgaḍim̐ bīm̐ṭa yĕkkavayyā

(||batti||)
sannalu sesi nīgu savulĕllām̐ guṭṭiṁchi
sannulu mobī nīgu sagiyā
yinniḍā śhrīveṁkaḍeśha yāgĕ yalamelumaṁga
kinnĕra vāyiṁchīm̐ gām̐giḍa niṁchavayyā