Battigala javaraala paayabu pemdligoomtura

బత్తిగల జవరాల పాయపు పెండ్లికూఁతుర
Language

(॥పల్లవి॥)
బత్తిగల జవరాల పాయపు పెండ్లికూఁతుర
చిత్తమురా బతిసేవ సేయఁగదే యిఁకను

(॥బత్తి॥)
యెడయక విభుఁడు నీ యింటి కిదె వచ్చినాఁడు
నిడువాలుఁ జూపులను నివాళియ్యవే
బడి నీతనిఁ గూడి పండుగ దినము నేఁడు
గుడిగొన్న నవ్వుల ముగ్గులు వెట్టవే

(॥బత్తి॥)
సొలవక నీకు దన చుట్టరికమెల్లాఁ జెప్పి
వెలయ నీ మోవితేనె విందువెట్టవే
పొలుపైన తలపోఁత పొంతనాలు నొనగూడె
పలుకుల కప్పురాల బాగాలు వెట్టవే

(॥బత్తి॥)
మంతనపుఁ గాఁగిటికి మంచి లగినము వచ్చె
బంతిఁ బులకల శాస పైఁజల్లవే
యింతలో శ్రీవేంకటేశుఁ డిన్నింటాను నిన్ను నేలె
వింత వింత రతులను వీడు దోళ్ళాడవే

(||pallavi||)
battigala javarāla pāyabu pĕṁḍligūm̐tura
sittamurā badiseva seyam̐gade yim̐kanu

(||batti||)
yĕḍayaga vibhum̐ḍu nī yiṁṭi kidĕ vachchinām̐ḍu
niḍuvālum̐ jūbulanu nivāḽiyyave
baḍi nīdanim̐ gūḍi paṁḍuga dinamu nem̐ḍu
guḍigŏnna navvula muggulu vĕṭṭave

(||batti||)
sŏlavaga nīgu dana suṭṭarigamĕllām̐ jĕppi
vĕlaya nī movidenĕ viṁduvĕṭṭave
pŏlubaina talabom̐ta pŏṁtanālu nŏnagūḍĕ
palugula kappurāla bāgālu vĕṭṭave

(||batti||)
maṁtanabum̐ gām̐giḍigi maṁchi laginamu vachchĕ
baṁtim̐ bulagala śhāsa paim̐jallave
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍinniṁṭānu ninnu nelĕ
viṁta viṁta radulanu vīḍu doḽḽāḍave