Bangaaru kalla buchchemmo

బంగారు కళ్ల బుచ్చెమ్మో
Work
Year
Language

పల్లవి:

బంగారు కళ్ల బుచ్చెమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె ఝిల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

చరణం 1:

నీలో చింతచిగురు పులుపున్నదే
బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
తళుకుల గుట్ట మెరుపుల తట్ట

నీలో చింతచిగురు పులుపున్నదే
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కొంటెమాట వెనుక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే

కళ్లుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే...
బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో...

చరణం 2:

నిన్న నేడు రేపు ఒక నిచ్చెన...
సిరిసిరి మువ్వ.. గడసరి గువ్వ
మనకు మనకు చెలిమే ఒక వంతెన
సొగసుల మువ్వా... ముసిముసి నవ్వా

నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా
మురళి కాని వెదురై పోదా జన్మా
చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయీ
జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠీ

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె ఝిల్లుమన్నాదే..
బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

pallavi:

baṁgāru kaḽla buchchĕmmo
sĕṁgāvi sĕṁpa lachchammo

baṁgāru kaḽla buchchĕmmo sĕṁgāvi sĕṁpa lachchammo
kobaṁlo ĕṁto muddammo o buṁgamūdi subbammo
saṁdĕ pŏddullo muddabaṁtalle ĕṁta muddugunnāve
vĕṁḍimuvvallĕ ghallumaṁṭuṁṭe guṁḍĕ jhillumannāde

baṁgāru kaḽla buchchĕmmo sĕṁgāvi sĕṁpa lachchammo
kobaṁlo ĕṁto muddammo o buṁgamūdi subbammo

saraṇaṁ 1:

nīlo siṁtasiguru pulubunnade
bulbul piṭṭa malmal maṭṭa
kavvaṁlāga silige kulugunnade
taḽugula guṭṭa mĕrubula taṭṭa

nīlo siṁtasiguru pulubunnade
kavvaṁlāga silige kulugunnade
kŏṁṭĕmāḍa vĕnuga sanuvunnade
tĕlusuguṁṭe manasu pilubunnade

kaḽlumūsi sīgaḍi uṁdaṁṭe vĕnnĕla navvuguṁṭuṁde
musuge leguṁṭe manase jagāna vĕlugai nilisi uṁṭuṁde...
baṁgāru kaḽla buchchĕmmo sĕṁgāvi sĕṁpa lachchammo...

saraṇaṁ 2:

ninna neḍu rebu ŏga nichchĕna...
sirisiri muvva.. gaḍasari guvva
managu managu sĕlime ŏga vaṁtĕna
sŏgasula muvvā... musimusi navvā

ninna neḍu rebu ŏga nichchĕna
managu managu sĕlime ŏga vaṁtĕna
ĕvarige vārai uṁṭe emuṁdammā
muraḽi kāni vĕdurai podā janmā
seyi seyi kalibe kosame hṛdayaṁ ichchāḍammāyī
jāriboyāga tirigi rādammo kālaṁ māyamarāṭhī

baṁgāru kaḽla buchchĕmmo sĕṁgāvi sĕṁpa lachchammo
kobaṁlo ĕṁto muddammo o buṁgamūdi subbammo
saṁdĕ pŏddullo muddabaṁtalle ĕṁta muddugunnāve
vĕṁḍimuvvallĕ ghallumaṁṭuṁṭe guṁḍĕ jhillumannāde..
baṁgāru kaḽla buchchĕmmo sĕṁgāvi sĕṁpa lachchammo
kobaṁlo ĕṁto muddammo o buṁgamūdi subbammo