Bamtibakshamulane baduga doragomtivi

బంతిపక్షములనే బదుక దొరకొంటివి
Language

(॥పల్లవి॥)
బంతిపక్షములనే బదుక దొరకొంటివి
వింతవింత చవులే వెదకేవు

(॥బంతి॥)
ఆపె చేపట్టుకుండఁగా అట్టె నాతో మాటాడేవు
తీపులను జంకించి తిట్టదా నిన్ను
యేపున వొకతె నీకు నేఁకారఁగానే నీవు
పైపైనే మాకింత బత్తిసేసేవు

(॥బంతి॥)
కన్నుల నాపె మొక్కఁగా కడు నాతో నవ్వేవు
సన్నల ముందలవట్టి సాదించదా
మున్నీటనుండి యొకతె మొగము చూడఁగానే
వన్నెలుగా నామీఁద వలపు చల్లేవు

(॥బంతి॥)
విందువెట్టి యాపె నీకు విడెము చేతికియ్యఁగా
కందువఁ గూడుతా నన్నుఁ గాఁగిలించేవు
అంది నే నలమేల్మంగ నాపె నీకుఁ జొక్కఁగాను
పొంది శ్రీవేంకటేశుఁడ భోగించేవు

(||pallavi||)
baṁtibakṣhamulane baduga dŏragŏṁṭivi
viṁtaviṁta savule vĕdagevu

(||baṁti||)
ābĕ sebaṭṭuguṁḍam̐gā aṭṭĕ nādo māḍāḍevu
tībulanu jaṁkiṁchi tiṭṭadā ninnu
yebuna vŏgadĕ nīgu nem̐kāram̐gāne nīvu
paibaine māgiṁta battisesevu

(||baṁti||)
kannula nābĕ mŏkkam̐gā kaḍu nādo navvevu
sannala muṁdalavaṭṭi sādiṁchadā
munnīḍanuṁḍi yŏgadĕ mŏgamu sūḍam̐gāne
vannĕlugā nāmīm̐da valabu sallevu

(||baṁti||)
viṁduvĕṭṭi yābĕ nīgu viḍĕmu sedigiyyam̐gā
kaṁduvam̐ gūḍudā nannum̐ gām̐giliṁchevu
aṁdi ne nalamelmaṁga nābĕ nīgum̐ jŏkkam̐gānu
pŏṁdi śhrīveṁkaḍeśhum̐ḍa bhogiṁchevu