Bamgaarumedalalona paramaatmumdu vaamde

బంగారుమేడలలోన పరమాత్ముఁడు వాఁడే
Language

(॥పల్లవి॥)
బంగారుమేడలలోన పరమాత్ముఁడు వాఁడే
సింగారాలు మీఁదమీఁద సేయరే చెలులు

(॥బంగా॥)
తట్టుపుణుఁగుల నూనె తగ నిండా నంటుకొని
గట్టిగాఁ గస్తూరియట కలివెట్టి
మట్టులేనిపన్నీట మజ్జనమాడె నిదె
వెట్టదీర నిందరును విసరరే చెలులు

(॥బంగా॥)
కప్పురపుగందవొడి కదు నిట్టె మెత్తుఁకొని
కొప్పుదువ్వి ముడిచెను గొజ్జంగలెల్లా
తెప్పులుగా నించుకొని తిరుమేన సొమ్ములెల్లా
దప్పిదేర విడెమీరే తలకొని చెలులు

(॥బంగా॥)
అలమేలుమంగ నురమందు నిట్టె నుంచుకొని
తలసిదండలుమోఁచె నిలువునను
చెలరేఁగి యారగించె శ్రీవేంకటేశ్వరుఁడు
కొలువున్నాఁడు మోహాలు గుప్పరే చెలులు

(||pallavi||)
baṁgārumeḍalalona paramātmum̐ḍu vām̐ḍe
siṁgārālu mīm̐damīm̐da seyare sĕlulu

(||baṁgā||)
taṭṭubuṇum̐gula nūnĕ taga niṁḍā naṁṭugŏni
gaṭṭigām̐ gastūriyaḍa kalivĕṭṭi
maṭṭulenibannīḍa majjanamāḍĕ nidĕ
vĕṭṭadīra niṁdarunu visarare sĕlulu

(||baṁgā||)
kappurabugaṁdavŏḍi kadu niṭṭĕ mĕttum̐kŏni
kŏppuduvvi muḍisĕnu gŏjjaṁgalĕllā
tĕppulugā niṁchugŏni tirumena sŏmmulĕllā
dappidera viḍĕmīre talagŏni sĕlulu

(||baṁgā||)
alamelumaṁga nuramaṁdu niṭṭĕ nuṁchugŏni
talasidaṁḍalumom̐sĕ niluvunanu
sĕlarem̐gi yāragiṁchĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
kŏluvunnām̐ḍu mohālu guppare sĕlulu