Baluraajasamainaanu batti neemeemdam galamdu

బలురాజసమైనాను బత్తి నీమీఁదఁ గలఁడు
Language

(॥పల్లవి॥)
బలురాజసమైనాను బత్తి నీమీఁదఁ గలఁడు
వలపులెల్లాఁ జల్లవే వచ్చీ నతఁడు

(॥బలు॥)
చేలకొంగు వట్టుకొని చేరి ప్రియములు చెప్పి
వాలాయించి పిలువరే వచ్చీ నతఁడు
తాలిమితో నిలుచుండి దయవుట్ట మొక్కు మొక్కి
వాలుకచూపు చూడవే వచ్చీ నతఁడు

(॥బలు॥)
కదిసి కానుక ఇచ్చి గడ్డమువట్టి వేఁడుక
వదనము చపవే వచ్చీ నతఁడు
వుదుటుగుబ్బల నూఁది పోదిగి కాఁగిటఁ బట్టి
వదలక వుండవే వచ్చీ నతఁడు

(॥బలు॥)
వేడుకలు వుట్చించి వెనకటిపొందుల-
వాడికలు సేయవే వచ్చీ నతఁడు
యీడనే శ్రీవేంకటేశు నిఁతలోనే కూడితివి
వాడలో దినదినము వచ్చీ నతఁడు

(||pallavi||)
balurājasamainānu batti nīmīm̐dam̐ galam̐ḍu
valabulĕllām̐ jallave vachchī nadam̐ḍu

(||balu||)
selagŏṁgu vaṭṭugŏni seri priyamulu sĕppi
vālāyiṁchi piluvare vachchī nadam̐ḍu
tālimido nilusuṁḍi dayavuṭṭa mŏkku mŏkki
vālugasūbu sūḍave vachchī nadam̐ḍu

(||balu||)
kadisi kānuga ichchi gaḍḍamuvaṭṭi vem̐ḍuga
vadanamu sabave vachchī nadam̐ḍu
vuduḍugubbala nūm̐di podigi kām̐giḍam̐ baṭṭi
vadalaga vuṁḍave vachchī nadam̐ḍu

(||balu||)
veḍugalu vuṭchiṁchi vĕnagaḍibŏṁdula-
vāḍigalu seyave vachchī nadam̐ḍu
yīḍane śhrīveṁkaḍeśhu nim̐talone kūḍidivi
vāḍalo dinadinamu vachchī nadam̐ḍu