Balugumdedaanam gaana badigem gaani

బలుగుండెదానఁ గాన బదికేఁ గాని
Language

(॥పల్లవి॥)
బలుగుండెదానఁ గాన బదికేఁ గాని
మలసి నివ్వెరగైతి మనసు నీదనవే

(॥బలు॥)
యెడమాటఁ గొంత వొద్దు యెదురుండి కొంతవొద్దు
కడపితిఁ దను నేఁ గలసేనంటా
అడియాసలే నిండె అంతటాఁ దా రాడాయ
పడలేను విరహానఁ బ్రాయము నీదనవే

(॥బలు॥)
తనుఁ దలపోసి కొంత తనరూపు వాసి కొంత
పెనఁగితి నన్నుఁ దాఁ బిలిచీనంటా
వినుకలే ఘనమాయ విడెమూఁ దా నంపఁడాయ
దిన మొక్కయేఁడాయ దేహము నీదనవే

(॥బలు॥)
కలలోనఁ గూడి కొంత కమ్మలు నడపి కొంత
నిలిపితి దీమనము నీవే నేనంటా
పలికి శ్రీవేంకటాద్రిపతి దా విచ్చేసి కూడె
చలఁగితి సంతసాన చిత్తము నీ దనవే

(||pallavi||)
baluguṁḍĕdānam̐ gāna badigem̐ gāni
malasi nivvĕragaidi manasu nīdanave

(||balu||)
yĕḍamāḍam̐ gŏṁta vŏddu yĕduruṁḍi kŏṁtavŏddu
kaḍabidim̐ danu nem̐ galasenaṁṭā
aḍiyāsale niṁḍĕ aṁtaḍām̐ dā rāḍāya
paḍalenu virahānam̐ brāyamu nīdanave

(||balu||)
tanum̐ dalabosi kŏṁta tanarūbu vāsi kŏṁta
pĕnam̐gidi nannum̐ dām̐ bilisīnaṁṭā
vinugale ghanamāya viḍĕmūm̐ dā naṁpam̐ḍāya
dina mŏkkayem̐ḍāya dehamu nīdanave

(||balu||)
kalalonam̐ gūḍi kŏṁta kammalu naḍabi kŏṁta
nilibidi dīmanamu nīve nenaṁṭā
paligi śhrīveṁkaḍādribadi dā vichchesi kūḍĕ
salam̐gidi saṁtasāna sittamu nī danave