Balimi seyagure padare meeru

బలిమి సేయకురే పదరే మీరు
Language

(॥పల్లవి॥)
బలిమి సేయకురే పదరే మీరు
చలము సాదించ నోప సారె మొక్కేఁ జాలునే

(॥బలి॥)
ఆన వెట్టుకునే వాఁడు ఆకెవద్ద నేలవుండె
దానికేపో కోపగించఁదగదా నాకు
వానిసుద్దు లిట్లానే వలసినట్లా నాడు
యేనెపము వేయనోప యీడ నుండేఁ జాలునే

(॥బలి॥)
నన్ను వలసినవాఁడు నాఁడేల పరాకాయ
కన్నుల నిందుకేపో నే గద్దించరాదా
యెన్ననేల వానిగుణా లెట్టువలసినా వచ్చు
తన్ను నేమీ నననోప తాలిములే చాలునే

(॥బలి॥)
దగ్గరి పైకొనేవాఁడు తారుకాణ లింత యేలే
యెగ్గువట్టి యిందుకేపో యెలయించితి
నిగ్గుల శ్రీవేంకటాద్రి నిలయుఁడు నన్నుఁ గూడె
సిగ్గులెల్లాఁ దీరెఁ దాను చెప్పినట్టె చాలునే

(||pallavi||)
balimi seyagure padare mīru
salamu sādiṁcha noba sārĕ mŏkkem̐ jālune

(||bali||)
āna vĕṭṭugune vām̐ḍu āgĕvadda nelavuṁḍĕ
dānigebo kobagiṁcham̐dagadā nāgu
vānisuddu liṭlāne valasinaṭlā nāḍu
yenĕbamu veyanoba yīḍa nuṁḍem̐ jālune

(||bali||)
nannu valasinavām̐ḍu nām̐ḍela parāgāya
kannula niṁdugebo ne gaddiṁcharādā
yĕnnanela vāniguṇā lĕṭṭuvalasinā vachchu
tannu nemī nananoba tālimule sālune

(||bali||)
daggari paigŏnevām̐ḍu tārugāṇa liṁta yele
yĕgguvaṭṭi yiṁdugebo yĕlayiṁchidi
niggula śhrīveṁkaḍādri nilayum̐ḍu nannum̐ gūḍĕ
siggulĕllām̐ dīrĕm̐ dānu sĕppinaṭṭĕ sālune