బదుకవయ్యా ఇంత పగిడికాఁడవై తివి
(॥పల్లవి॥)
బదుకవయ్యా ఇంత పగిడికాఁడవై తివి
పదరి వొకరొకరు పైకొనఁగాను
(॥బదు॥)
మనసొక్కటాయనా మాట నీకుఁ జెల్లెనా
చెనకి యాకెపై నీకె చేఇచాచగా
కనుపట్టెనా నీకు కడునవ్వు వచ్చెనా
వెనుకొని ఆకె నీకె వెసఁ దిట్టఁగాను
(॥బదు॥)
చలము నీకుఁ జెల్లెనా సమ్మతి నీకాయనా
బలిమి నాకె నీకె పరచఁగాను
తలఁపు లేడేరెనా తగవు గెలిచెనా
సలిగెతో నాకె నీకె జంకించఁగాను
(॥బదు॥)
పంతాలు సమకూడెనా పనులు నీకు దక్కెనా
ఇంతలో నాకె నీకె విన్నెనయఁగాను
సంతోసమాయనా చక్కని శ్రీవేంకటేశ
పొంత నిన్నాకె నీకెఁ బొగడఁగాను
(||pallavi||)
badugavayyā iṁta pagiḍigām̐ḍavai tivi
padari vŏgarŏgaru paigŏnam̐gānu
(||badu||)
manasŏkkaḍāyanā māḍa nīgum̐ jĕllĕnā
sĕnagi yāgĕbai nīgĕ seisāsagā
kanubaṭṭĕnā nīgu kaḍunavvu vachchĕnā
vĕnugŏni āgĕ nīgĕ vĕsam̐ diṭṭam̐gānu
(||badu||)
salamu nīgum̐ jĕllĕnā sammadi nīgāyanā
balimi nāgĕ nīgĕ parasam̐gānu
talam̐pu leḍerĕnā tagavu gĕlisĕnā
saligĕdo nāgĕ nīgĕ jaṁkiṁcham̐gānu
(||badu||)
paṁtālu samagūḍĕnā panulu nīgu dakkĕnā
iṁtalo nāgĕ nīgĕ vinnĕnayam̐gānu
saṁtosamāyanā sakkani śhrīveṁkaḍeśha
pŏṁta ninnāgĕ nīgĕm̐ bŏgaḍam̐gānu