Badugarayyaa meeru pachchideranu

బతుకరయ్యా మీరు పచ్చిదేరను
Language

(॥పల్లవి॥)
బతుకరయ్యా మీరు పచ్చిదేరను
కతలుఁ గారణాలుగాఁ గంటిగా యీ మేలు

(॥బతు॥)
యెలమి నేనుండఁగానే యీకె వచ్చి నీతోను
మలఁగమఱఁగుననే మాటలాడను
అలనీదేవులో యీకె ఆకె చెలికత్తెయో
కలిగె నీకు నేఁడు కంటిఁగా యీమేలు

(॥బతు॥)
దండ నేనుఁ జూడఁగానే తా వచ్చి నీమేను ముట్టి
చండిపెట్టి పెనఁగుతా సన్న చేసెను
మెండగు నీచుట్టమో మెలుత నీ పొరుగాపో
గండికాఁడ నీకు నబ్బెఁ గంటిఁగా యీమేలు

(॥బతు॥)
నీతో నేనుఁ గూడఁగానే నెట్టన వచ్చి యీసతి
యేతుల నిన్ను నెనసి యింతచేసెను
జాతిగల కొలమాపో చనవది వెలయాలో
ఘాతల శ్రీవేంకటేశ కంటిఁగా యీమేలు

(||pallavi||)
badugarayyā mīru pachchideranu
kadalum̐ gāraṇālugām̐ gaṁṭigā yī melu

(||badu||)
yĕlami nenuṁḍam̐gāne yīgĕ vachchi nīdonu
malam̐gamaṟam̐gunane māḍalāḍanu
alanīdevulo yīgĕ āgĕ sĕligattĕyo
kaligĕ nīgu nem̐ḍu kaṁṭim̐gā yīmelu

(||badu||)
daṁḍa nenum̐ jūḍam̐gāne tā vachchi nīmenu muṭṭi
saṁḍibĕṭṭi pĕnam̐gudā sanna sesĕnu
mĕṁḍagu nīsuṭṭamo mĕluda nī pŏrugābo
gaṁḍigām̐ḍa nīgu nabbĕm̐ gaṁṭim̐gā yīmelu

(||badu||)
nīdo nenum̐ gūḍam̐gāne nĕṭṭana vachchi yīsadi
yedula ninnu nĕnasi yiṁtasesĕnu
jādigala kŏlamābo sanavadi vĕlayālo
ghādala śhrīveṁkaḍeśha kaṁṭim̐gā yīmelu