బతికితి వన్నిటాను పడఁతివల్లను నీవు
(॥పల్లవి॥)
బతికితి వన్నిటాను పడఁతివల్లను నీవు
రతికిఁ బిలువవయ్య రవ్వగాఁ జేసీని
(॥బతి॥)
సుద్దులు నీతోఁ జెప్పి చొక్కించి అందరుఁ జూడ
బుద్దులు నీకు నేరిపీఁ బొలిఁతి
వొద్దనుండి నవ్వుతాను వొడివట్టి తీసితీసి
పెద్దరికములు నేసి ప్రియముచెప్పీని
(॥బతి॥)
చెక్కులు నీకు నొక్కి సేవలు గొంత సేసి
ఇక్కువలెల్లా నంటీ నింతి
అక్కరతో వీడెమిచ్చి ఆకుమడిచొసఁగుతా
వెక్కసపుటిచ్చకము వేమారుఁ జేసీని
(॥బతి॥)
నెమ్మదిఁ గాఁగిట నించి నీకు మోవి చవిచూపి
సమ్మతించఁజేసి కూడె సకియ
మమ్ముఁ గూడితివి నేఁడు మక్కువ శ్రీవేంకటేశ
చిమ్ముచుఁ గమ్మటిఁ దాను సేసలువెట్టీని
(||pallavi||)
badigidi vanniḍānu paḍam̐tivallanu nīvu
radigim̐ biluvavayya ravvagām̐ jesīni
(||badi||)
suddulu nīdom̐ jĕppi sŏkkiṁchi aṁdarum̐ jūḍa
buddulu nīgu neribīm̐ bŏlim̐ti
vŏddanuṁḍi navvudānu vŏḍivaṭṭi tīsidīsi
pĕddarigamulu nesi priyamusĕppīni
(||badi||)
sĕkkulu nīgu nŏkki sevalu gŏṁta sesi
ikkuvalĕllā naṁṭī niṁti
akkarado vīḍĕmichchi āgumaḍisŏsam̐gudā
vĕkkasabuḍichchagamu vemārum̐ jesīni
(||badi||)
nĕmmadim̐ gām̐giḍa niṁchi nīgu movi savisūbi
sammadiṁcham̐jesi kūḍĕ sagiya
mammum̐ gūḍidivi nem̐ḍu makkuva śhrīveṁkaḍeśha
simmusum̐ gammaḍim̐ dānu sesaluvĕṭṭīni