బడలె నీ మేనెల్ల పవ్వళింతువు రావయ్య
(॥పల్లవి॥)
బడలె నీ మేనెల్ల పవ్వళింతువు రావయ్య
తడయక నాకుచాలు తలగడబిల్లలు
(॥బడ॥)
ఇంత పొద్దువోయి వచ్చే వేడనుంటి విందాఁకా
యెంతమాటలఁ బెట్టుక యెవ్వతుండెనో
పంతపుఁబందేలకు పగడసా లాడితివో
సంతజాణతనములు సతులెల్ల నాడిరో
(॥బడ॥)
తడఁబడి మాటాడేవు తలఁ పెక్కడిపరాకో
బడిఁబెట్టు కెవ్వతైనా పనిగొనెనో
వెడయాసల నెందైనా వేడుకకాఁడవైతివో
వడివెట్టి వాడవారు పలపులు చల్లిరో
(॥బడ॥)
నన్నుఁ గాఁగిలంచి కూడి నలుదిక్కులు చూచేవు
సన్నల నెవ్వతైనా పంచకు వచ్చెనో
యిన్నిటా శ్రీవేంకటేశ యేమి సరసమాడేవో
కన్నవారెల్లా నీకీకందువ నేరిపిరో
(||pallavi||)
baḍalĕ nī menĕlla pavvaḽiṁtuvu rāvayya
taḍayaga nāgusālu talagaḍabillalu
(||baḍa||)
iṁta pŏdduvoyi vachche veḍanuṁṭi viṁdām̐kā
yĕṁtamāḍalam̐ bĕṭṭuga yĕvvaduṁḍĕno
paṁtabum̐baṁdelagu pagaḍasā lāḍidivo
saṁtajāṇadanamulu sadulĕlla nāḍiro
(||baḍa||)
taḍam̐baḍi māḍāḍevu talam̐ pĕkkaḍibarāgo
baḍim̐bĕṭṭu kĕvvadainā panigŏnĕno
vĕḍayāsala nĕṁdainā veḍugagām̐ḍavaidivo
vaḍivĕṭṭi vāḍavāru palabulu salliro
(||baḍa||)
nannum̐ gām̐gilaṁchi kūḍi naludikkulu sūsevu
sannala nĕvvadainā paṁchagu vachchĕno
yinniḍā śhrīveṁkaḍeśha yemi sarasamāḍevo
kannavārĕllā nīgīgaṁduva neribiro