Baanam veshaade puvvula baanam veshaade

బాణం వేశాడే పువ్వుల బాణం వేశాడే
Work
Year
Language

పల్లవి:

బాణం వేశాడే ..పువ్వుల బాణం వేశాడే
నేను విరిసానే ఒళ్ళే ..నేను మరిచానే
ఓ అలలో చిక్కి నేను తడిశా.. కడలై పొంగి పొరలితినే
సుస్వరాల వీణను మీటిన మదనుడు బాణం వేశాడే

ఆశ తెలిసిందే ..కన్నె ఆశ తెలిసిందే
ఆశ తెలిసిందే ..కన్నె ఆశ తెలిసిందే
ఈ కనులై విరిసే కలువలలో పున్నమి వెన్నెల కురిసిందే
అంబరాలు విడిచిన చినుకులు చిలికెను నేడు జడివానై

చరణం 1:

సూరీడొస్తే నా కన్నులను తెరచి ఊరించేది ..నీ ముఖమే
కునుకే తీసిన కనులే చూసినవి స్వప్నాల మెరిసె ..నీ ముఖమే
నను పట్టి నాలో తెలియంది తెలిపే నీ అడుగుజాడల నడిచే
నీకున్న సరదాలు నా కన్ను తెలిపే అవి తీరు వైనం నన్ను కుదిపే

వీడ్కోలు పలికే విడలేని మనసే నిలిచేను నా కంటి వెలుగై
నన్నొదిలి నువ్వెళ్ళి నే తల్లడిల్లె వాకిళ్ళ నను చూసి నవ్వుతావు.. వాకిళ్ళ నను చూసి నవ్వుతావు

ఆశ తెలిసిందే ..కన్నె ఆశ తెలిసిందే
ఆశ తెలిసిందే ..కన్నె ఆశ తెలిసిందే
ఓ అలలో చిక్కి నేను తడిశా ..కడలై పొంగి పొరలితినే
అంబరాలు విడిచిన చినుకులు చిలికెను ...నేడు జడివానై !

చరణం 2:

నవ్వే నీ ముఖం నే కన్న కలలు సిరులిచ్చి కొనలేను ..చెలియా
నువ్వే ఎదురుగా నిలిచే క్షణాల్లో కల వచ్చెననుకున్నానే ..సఖియా
ఏకాంతాల ఒడి నీ గుండె గూటిలో సిరిమల్లె అల్లె పొదరిల్లు
కొమ్మా రెమ్మా చిగురించే చైత్రమే రాయాలి మన ప్రేమ కావ్యం

కను రెప్ప మూస్తే కలలోన నీవే కనుపాప తెర మీద నీవే
కడ దాక విడలేని కలకాని మౌనం సరిజోడు నా తోడు నీవే ...సరిజోడు నా తోడు నీవే

బాణం వేశాడే ..పువ్వుల బాణం వేశాడే
నేను విరిసానే ఒళ్ళే ..నేను మరిచానే
ఓ అలలో చిక్కి నేను తడిశా.. కడలై పొంగి పొరలితినే
సుస్వరాల వీణను మీటిన మదనుడు బాణం వేశాడే

pallavi:

bāṇaṁ veśhāḍe ..puvvula bāṇaṁ veśhāḍe
nenu virisāne ŏḽḽe ..nenu marisāne
o alalo sikki nenu taḍiśhā.. kaḍalai pŏṁgi pŏralidine
susvarāla vīṇanu mīḍina madanuḍu bāṇaṁ veśhāḍe

āśha tĕlisiṁde ..kannĕ āśha tĕlisiṁde
āśha tĕlisiṁde ..kannĕ āśha tĕlisiṁde
ī kanulai virise kaluvalalo punnami vĕnnĕla kurisiṁde
aṁbarālu viḍisina sinugulu siligĕnu neḍu jaḍivānai

saraṇaṁ 1:

sūrīḍŏste nā kannulanu tĕrasi ūriṁchedi ..nī mukhame
kunuge tīsina kanule sūsinavi svapnāla mĕrisĕ ..nī mukhame
nanu paṭṭi nālo tĕliyaṁdi tĕlibe nī aḍugujāḍala naḍise
nīgunna saradālu nā kannu tĕlibe avi tīru vainaṁ nannu kudibe

vīḍkolu palige viḍaleni manase nilisenu nā kaṁṭi vĕlugai
nannŏdili nuvvĕḽḽi ne tallaḍillĕ vāgiḽḽa nanu sūsi navvudāvu.. vāgiḽḽa nanu sūsi navvudāvu

āśha tĕlisiṁde ..kannĕ āśha tĕlisiṁde
āśha tĕlisiṁde ..kannĕ āśha tĕlisiṁde
o alalo sikki nenu taḍiśhā ..kaḍalai pŏṁgi pŏralidine
aṁbarālu viḍisina sinugulu siligĕnu ...neḍu jaḍivānai !

saraṇaṁ 2:

navve nī mukhaṁ ne kanna kalalu sirulichchi kŏnalenu ..sĕliyā
nuvve ĕdurugā nilise kṣhaṇāllo kala vachchĕnanugunnāne ..sakhiyā
egāṁtāla ŏḍi nī guṁḍĕ gūḍilo sirimallĕ allĕ pŏdarillu
kŏmmā rĕmmā siguriṁche saitrame rāyāli mana prema kāvyaṁ

kanu rĕppa mūste kalalona nīve kanubāba tĕra mīda nīve
kaḍa dāga viḍaleni kalagāni maunaṁ sarijoḍu nā toḍu nīve ...sarijoḍu nā toḍu nīve

bāṇaṁ veśhāḍe ..puvvula bāṇaṁ veśhāḍe
nenu virisāne ŏḽḽe ..nenu marisāne
o alalo sikki nenu taḍiśhā.. kaḍalai pŏṁgi pŏralidine
susvarāla vīṇanu mīḍina madanuḍu bāṇaṁ veśhāḍe