బాపుబాపు నీవంటి పతికి నిల్లాలనైతి
(॥పల్లవి॥)
బాపుబాపు నీవంటి పతికి నిల్లాలనైతి
నీపై వలపే నాకు నిచ్చకల్యాణము
(॥బాపు॥)
యెంత నోమునోఁచెనో యీచనుఁగొండలు, నేఁడు
వంతుల నీకరపల్లవములు ముంచె
వింత లెట్టిభాగ్యము గావించెనో చెక్కుటద్దాలు
పొంత నీరూపమునీడ పొలయఁగలిగెను
(॥బాపు॥)
యేమి దపము చేసెనో యీకన్నుఁగలువలు
నీముఖచంద్రునిపొందు నెమ్మిఁ గలిగె
కామించి యేమి పుణ్యమో కందువనామోవిపండు
వోముచు నీమూర్తికి నుపారమాయ
(॥బాపు॥)
యెన్నటితగులాయమో యీబాహులతలకు
వన్నె నీరతి చెమటవాన గలిగె
అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
కన్నెనాటనుండి నీతో కాఁపురము గలిగె
(||pallavi||)
bābubābu nīvaṁṭi padigi nillālanaidi
nībai valabe nāgu nichchagalyāṇamu
(||bābu||)
yĕṁta nomunom̐sĕno yīsanum̐gŏṁḍalu, nem̐ḍu
vaṁtula nīgaraballavamulu muṁchĕ
viṁta lĕṭṭibhāgyamu gāviṁchĕno sĕkkuḍaddālu
pŏṁta nīrūbamunīḍa pŏlayam̐galigĕnu
(||bābu||)
yemi dabamu sesĕno yīgannum̐galuvalu
nīmukhasaṁdrunibŏṁdu nĕmmim̐ galigĕ
kāmiṁchi yemi puṇyamo kaṁduvanāmovibaṁḍu
vomusu nīmūrdigi nubāramāya
(||bābu||)
yĕnnaḍidagulāyamo yībāhuladalagu
vannĕ nīradi sĕmaḍavāna galigĕ
anniḍā śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
kannĕnāḍanuṁḍi nīdo kām̐puramu galigĕ