(॥పల్లవి॥)
అయ్యో నీకు వగచినదే దోసమా
ఇయ్యడ నీకు వలచుటిదే దోసమా
(॥అయ్యో॥)
వాలాయించి మొక్కేవు వాదులకే నిక్కేవు
ఔలే నీతో నవ్వినదే దోసమా
సోలగిలఁ జూచేవు చొక్కి చొక్కి లాచేవు
యీలాగై నీవద్దనుండే దిదే దోసమా
(॥అయ్యో॥)
బొమ్మల జంకించేవు పూఁటవూఁటకు మించేవు
అమ్మరో నీయాలనైన దదే దోసమా
రమ్మనుచు మరపేవు రాజసాలు నెరపేవు
యిమ్ముల నిన్ను నమ్మినదిదే దోసమా
(॥అయ్యో॥)
యేకతానకుఁ దీసేవు యేమన్నా నోరుమూసేవు
ఆకుమడిచియిచ్చిన దదే దోసమా
పైకొని శ్రీవేంకటేశ పచ్చిగా నన్నుఁ గూడేవు
యీకడ నీవే నేనై తిదే దోసమా
(||pallavi||)
ayyo nīgu vagasinade dosamā
iyyaḍa nīgu valasuḍide dosamā
(||ayyo||)
vālāyiṁchi mŏkkevu vādulage nikkevu
aule nīdo navvinade dosamā
solagilam̐ jūsevu sŏkki sŏkki lāsevu
yīlāgai nīvaddanuṁḍe dide dosamā
(||ayyo||)
bŏmmala jaṁkiṁchevu pūm̐ṭavūm̐ṭagu miṁchevu
ammaro nīyālanaina dade dosamā
rammanusu marabevu rājasālu nĕrabevu
yimmula ninnu namminadide dosamā
(||ayyo||)
yegadānagum̐ dīsevu yemannā norumūsevu
āgumaḍisiyichchina dade dosamā
paigŏni śhrīveṁkaḍeśha pachchigā nannum̐ gūḍevu
yīgaḍa nīve nenai tide dosamā