Ayinattayyeemgaaga adanuni maayalivi

అయినట్టయ్యీఁగాక అతనుని మాయలివి
Language

(॥పల్లవి॥)
అయినట్టయ్యీఁగాక అతనుని మాయలివి
దయయు దాక్షిణ్య మెంచీఁ దనకేఁటికే

(॥అయి॥)
రచ్చకెక్కె వలపులు రాఁపులకెక్కెఁ జన్నులు
ఇచ్చకాలు మాపుదాకాఁ నిఁకనేఁటికే
వెచ్చనాయ నిట్టూర్పు వెరఁగు పైతరవాయ
తచ్చనజగడములు తనకేలే పతికి

(॥అయి॥)
కొప్పు గడువెడజారెఁ గోపము కన్నుల మీరె
ఇప్పుడు మూసిదాఁపురా లిఁకనేఁటికే
చప్పనాయ సాదింపులు చౌకాయఁ గుంటెనలు
దప్పిదేరేవినయాలు తనకేఁటికే

(॥అయి॥)
రంగుమీరెఁ బులకలు రతులు కాఁగిటఁ జేరె
ఇంగితాకారాలు చూడ నిఁకనేఁటికే
అంగవించి శ్రీవేంకటాధిపుఁడు ననుఁ గూడె
దంగుడు బంతములాడఁ దనకేఁటికే

(||pallavi||)
ayinaṭṭayyīm̐gāga adanuni māyalivi
dayayu dākṣhiṇya mĕṁchīm̐ danagem̐ṭige

(||ayi||)
rachchagĕkkĕ valabulu rām̐pulagĕkkĕm̐ jannulu
ichchagālu mābudāgām̐ nim̐kanem̐ṭige
vĕchchanāya niṭṭūrbu vĕram̐gu paidaravāya
tachchanajagaḍamulu tanagele padigi

(||ayi||)
kŏppu gaḍuvĕḍajārĕm̐ gobamu kannula mīrĕ
ippuḍu mūsidām̐purā lim̐kanem̐ṭige
sappanāya sādiṁpulu saugāyam̐ guṁṭĕnalu
dappiderevinayālu tanagem̐ṭige

(||ayi||)
raṁgumīrĕm̐ bulagalu radulu kām̐giḍam̐ jerĕ
iṁgidāgārālu sūḍa nim̐kanem̐ṭige
aṁgaviṁchi śhrīveṁkaḍādhibum̐ḍu nanum̐ gūḍĕ
daṁguḍu baṁtamulāḍam̐ danagem̐ṭige