Avvali momidiyela aluga limkaanela

అవ్వలి మోమిదియేల అలుక లింకానేల
Language

(॥పల్లవి॥)
అవ్వలి మోమిదియేల అలుక లింకానేల
జవ్వని మీఁదఁ బ్రియము చల్లఁ గదవయ్యా

(॥అవ్వ॥)
చెవి నీపై చింతకు చెక్కిటిచేయే సాక్షి
కలవిరహానకు మెయికాఁకే సాక్షి
నెలకొన్నయాసలకు నిట్ట చూపులే సాక్షి
తెలుసుకొందువుగాని ద్రిష్టింపవయ్యా

(॥అవ్వ॥)
నిండుఁగాతాళమునకు నిట్టూర్పులే సాక్షి
దండి తమకమునకు తబ్బిబ్బు సాక్షి
చండివడ్డ కోరికెకు జాగరములే సాక్షి
వుండవెల్లా నిఁకనేల వొకటి గావయ్యా

(॥అవ్వ॥)
కాఁగిటికి లాచుటకుఁ గదిసియుండుటే సాక్షి
మాఁగినమనసునకు మనసే సాక్షి
పాఁగిన శ్రీవేంకటేశ పడఁతిఁ గూడితి విట్టె
నాఁగువారీ వేడుకలు నవ్వు నవ్వవయయ్యా

(||pallavi||)
avvali momidiyela aluga liṁkānela
javvani mīm̐dam̐ briyamu sallam̐ gadavayyā

(||avva||)
sĕvi nībai siṁtagu sĕkkiḍiseye sākṣhi
kalavirahānagu mĕyigām̐ke sākṣhi
nĕlagŏnnayāsalagu niṭṭa sūbule sākṣhi
tĕlusugŏṁduvugāni driṣhṭiṁpavayyā

(||avva||)
niṁḍum̐gādāḽamunagu niṭṭūrbule sākṣhi
daṁḍi tamagamunagu tabbibbu sākṣhi
saṁḍivaḍḍa korigĕgu jāgaramule sākṣhi
vuṁḍavĕllā nim̐kanela vŏgaḍi gāvayyā

(||avva||)
kām̐giḍigi lāsuḍagum̐ gadisiyuṁḍuḍe sākṣhi
mām̐ginamanasunagu manase sākṣhi
pām̐gina śhrīveṁkaḍeśha paḍam̐tim̐ gūḍidi viṭṭĕ
nām̐guvārī veḍugalu navvu navvavayayyā