అవునయ్యా మంచివాఁడ వౌదువయ్యా
(॥పల్లవి॥)
అవునయ్యా మంచివాఁడ వౌదువయ్యా
యివలానవలా నిన్ను నింతసేయఁ జెల్లునా
(॥ఆవు॥)
అంగనచే నొకమాఁట అప్పణ యిప్పించరాదా
చెంగట నీచెప్పినట్లు సేసేఁగాని
ముంగిటను నీవూడిగమున కంపినంతలోనే
యెంగిలిగా నీకు నే నింత సేయఁజెల్లునా
(॥ఆవు॥)
చెలిచేతఁ దనకిది సెలవనిపించరాదా
అలరి నీతోఁ బెండ్లాడేఁగాని
కలికి నాచేత నీకు కాని కంపినంతలోనే
యెలమి నిన్నింటుకొని యింతసేయఁజెల్లునా
(॥ఆవు॥)
వనితచేత నాకు వంతు పెట్టించుకోరాదా
వొనర శ్రీవేంకటేశ వూఁకొనేఁగాని
చెనకి నీతో మాట చెప్పి రమ్మన్నంతలోనే
యెనసితిని నన్ను నే నింత సేయఁజెల్లునే
(||pallavi||)
avunayyā maṁchivām̐ḍa vauduvayyā
yivalānavalā ninnu niṁtaseyam̐ jĕllunā
(||āvu||)
aṁganase nŏgamām̐ṭa appaṇa yippiṁcharādā
sĕṁgaḍa nīsĕppinaṭlu sesem̐gāni
muṁgiḍanu nīvūḍigamuna kaṁpinaṁtalone
yĕṁgiligā nīgu ne niṁta seyam̐jĕllunā
(||āvu||)
sĕlisedam̐ danagidi sĕlavanibiṁcharādā
alari nīdom̐ bĕṁḍlāḍem̐gāni
kaligi nāseda nīgu kāni kaṁpinaṁtalone
yĕlami ninniṁṭugŏni yiṁtaseyam̐jĕllunā
(||āvu||)
vanidaseda nāgu vaṁtu pĕṭṭiṁchugorādā
vŏnara śhrīveṁkaḍeśha vūm̐kŏnem̐gāni
sĕnagi nīdo māḍa sĕppi rammannaṁtalone
yĕnasidini nannu ne niṁta seyam̐jĕllune