Aviyu naviyu marunammule kaavaa

అవియు నవియు మరునమ్ములే కావా
Language

(॥పల్లవి॥)
అవియు నవియు మరునమ్ములే కావా
వివరింప భావములు వేరువేరై తోఁచెను

(॥అవి॥)
చెలిమాటుననుండి వేసినతామెరపువ్వు
కలికి నీపతికిని కానికాయను
మొలకగుబ్బలతమ్మి మొగుడ లంటఁగ నీవు
అలమి పైకొంటేను అవె పూజలాయను

(॥అవి॥)
కోమలి దవనపుచిగురుగుత్తి వేసిన
చేముంచి సన్నతనికిఁ జేసుటాయను
ఆమని మోవిచిగురు అంతలోఁ జవిచూపిన
వేమారు వలపులకు విందులాయను

(॥అవి॥)
యీవేళ నీజాజిదండ యిదె మెడ వేసితేను
శ్రీవేంకటేశునికి మచ్చికలాయను
కూవలై నీమేన జాజుకొన్నపులకవిరులు
మోవ నితనిఁ గూడఁగా ముగమాయను

(||pallavi||)
aviyu naviyu marunammule kāvā
vivariṁpa bhāvamulu veruverai tom̐sĕnu

(||avi||)
sĕlimāḍunanuṁḍi vesinadāmĕrabuvvu
kaligi nībadigini kānigāyanu
mŏlagagubbaladammi mŏguḍa laṁṭam̐ga nīvu
alami paigŏṁṭenu avĕ pūjalāyanu

(||avi||)
komali davanabusigurugutti vesina
semuṁchi sannadanigim̐ jesuḍāyanu
āmani movisiguru aṁtalom̐ javisūbina
vemāru valabulagu viṁdulāyanu

(||avi||)
yīveḽa nījājidaṁḍa yidĕ mĕḍa vesidenu
śhrīveṁkaḍeśhunigi machchigalāyanu
kūvalai nīmena jājugŏnnabulagavirulu
mova nidanim̐ gūḍam̐gā mugamāyanu