Aviye po nemdu maado namtisese tabamulu

అవియే పో నేఁడు మాతో నంటిసేసే తపములు
Language

(॥పల్లవి॥)
అవియే పో నేఁడు మాతో నంటిసేసే తపములు
వివరించుకొని యిట్టె విచ్చేయుమనవే

(॥అవి॥)
కొండలకొట్టగొనల గోరమైన తపములు
పండుఁబలములలోని పచ్చిమేఁతలు
గుండెదాఁకేమంత్రాల కుత్తికలో జపములు
దండకారుణ్యాన నాఁడు తాఁ జేసెఁగా

(॥అవి॥)
యేరులలో మునుకలు యెక్కువఆచారాలు
ఆరీతిమోనముతోడియానందాలు
కోరికోరి చలివేఁడి కోటికోటినేమాలు
చేరి యీరీతిఁ దపాలు సేసినాఁడుగా

(॥అవి॥)
సమ్మతించఁజేసిన యాసనభేదబంధాలు
వుమ్మడి యన్యోన్యపుయోగాలు
దొమ్మి శ్రీవేంకటపతి తొల్లిసేసె నట్లనె
రమ్మని నేఁడును నారతిఁ జేసెఁగా

(||pallavi||)
aviye po nem̐ḍu mādo naṁṭisese tabamulu
vivariṁchugŏni yiṭṭĕ vichcheyumanave

(||avi||)
kŏṁḍalagŏṭṭagŏnala goramaina tabamulu
paṁḍum̐balamulaloni pachchimem̐talu
guṁḍĕdām̐kemaṁtrāla kuttigalo jabamulu
daṁḍagāruṇyāna nām̐ḍu tām̐ jesĕm̐gā

(||avi||)
yerulalo munugalu yĕkkuvaāsārālu
ārīdimonamudoḍiyānaṁdālu
korigori salivem̐ḍi koḍigoḍinemālu
seri yīrīdim̐ dabālu sesinām̐ḍugā

(||avi||)
sammadiṁcham̐jesina yāsanabhedabaṁdhālu
vummaḍi yanyonyabuyogālu
dŏmmi śhrīveṁkaḍabadi tŏllisesĕ naṭlanĕ
rammani nem̐ḍunu nāradim̐ jesĕm̐gā