Avi naa kaamgida namareenaa

అవి నా కాఁగిట నమరీనా
Language

(॥పల్లవి॥)
అవి నా కాఁగిట నమరీనా
జవళి మాఁటలకు జాణవు గదరా

(॥అవి॥)
పలుకవదేమే పడఁతీ నా-
పలుకులు చిలుకలపలుకులె పో
యిల నీరూపున కెనయౌనా యిటు
పొలఁతులఁ జిలుకలఁ బోలుచరటరా

(॥అవి॥)
చూపులఁ జూడవే సుదతీ నా-
చూపులు మదనుని తూపులెరా
యేపున నీ కందుకేమివనె
పోపో ఆసరి పోల్తురు గదరా

(॥అవి॥)
అలమవె కాఁగిట నతివా
అలమీఁ దీఁగెలె ఆమారు
కలసితి శ్రీ వేంకటవిభుఁడను నే
పొలిఁతి నీలతలనె పోల్తురుగదరా

(||pallavi||)
avi nā kām̐giḍa namarīnā
javaḽi mām̐ṭalagu jāṇavu gadarā

(||avi||)
palugavademe paḍam̐tī nā-
palugulu silugalabalugulĕ po
yila nīrūbuna kĕnayaunā yiḍu
pŏlam̐tulam̐ jilugalam̐ bolusaraḍarā

(||avi||)
sūbulam̐ jūḍave sudadī nā-
sūbulu madanuni tūbulĕrā
yebuna nī kaṁdugemivanĕ
pobo āsari polduru gadarā

(||avi||)
alamavĕ kām̐giḍa nadivā
alamīm̐ dīm̐gĕlĕ āmāru
kalasidi śhrī veṁkaḍavibhum̐ḍanu ne
pŏlim̐ti nīladalanĕ poldurugadarā