అవధరించవయ్యా ఆపె సేసే చేఁతలు
(॥పల్లవి॥)
అవధరించవయ్యా ఆపె సేసే చేఁతలు
తివిరి చేతులు చాఁచీ దిట్టయేతులాఁడి
(॥అవ॥)
చిక్కి నవ్వులు నవ్వి సిగ్గులు పైఁ జిలికించి
మొక్కీనిదె కొలువులో ముద్దరాలు
వెక్కసపుమాట లాడి వేడుకలు పచరించి
కక్కసించీ రతులకు కతకారివనిత
(॥అవ॥)
తేఁటలచూపులు చూచి తీపుల పైఁ బడనిచ్చి
నాటించీ గోరు నీపై నాలికత్తె
వాఁటముగా పై నొరగి వలుదచన్నుల నొత్తి
గాఁటపు సన్నలు సేసీ గయ్యాళి మగువ
(॥అవ॥)
దొంతరసాముల సేసి దోమటి మోవి దొడిగి
వింతగాఁ గాఁగిటఁ గూడీ వేసదా రీకె
యింతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
రంతుసేసీ నిన్ను మెచ్చి రచనల తరుణి
(||pallavi||)
avadhariṁchavayyā ābĕ sese sem̐talu
tiviri sedulu sām̐sī diṭṭayedulām̐ḍi
(||ava||)
sikki navvulu navvi siggulu paim̐ jiligiṁchi
mŏkkīnidĕ kŏluvulo muddarālu
vĕkkasabumāḍa lāḍi veḍugalu pasariṁchi
kakkasiṁchī radulagu kadagārivanida
(||ava||)
tem̐ṭalasūbulu sūsi tībula paim̐ baḍanichchi
nāḍiṁchī goru nībai nāligattĕ
vām̐ṭamugā pai nŏragi valudasannula nŏtti
gām̐ṭabu sannalu sesī gayyāḽi maguva
(||ava||)
dŏṁtarasāmula sesi domaḍi movi dŏḍigi
viṁtagām̐ gām̐giḍam̐ gūḍī vesadā rīgĕ
yiṁtalo śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
raṁtusesī ninnu mĕchchi rasanala taruṇi