అవధరించవయ్యా ఆపె కలికిచేఁతలు
(॥పల్లవి॥)
అవధరించవయ్యా ఆపె కలికిచేఁతలు
తివిరి చెమటమంచు దిగుపారించీని
(॥అవ॥)
తేనెగారే మోవితోడ తేట మాటలాడుతాను
కానుకిచ్చి యాపె నిన్నుఁ గరఁగించీని
సానఁబట్టే చూపులను చలములు రేఁపుతాను
వీనులపండువగా విన్నపాలు సేసీని
(॥అవ॥)
జంకెనబొమ్మలతోడ సరసములాడుతాను
లంకెలపొందుల నాపె లళి రేఁచీని
కుంకుమ గుబ్బలమీఁది గురుతులు చూపుతాను
కొంకునుఁగొసరు లేక కొంగులు వట్టీని
(॥అవ॥)
వెన్నెలనవ్వులతోడ వేడుకలు నెరపుతా
కిన్నెరమీఁట్లనాపె గిలిగించీని
అన్నిటా శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
సన్నల నిన్నుఁగూడితే చవులు తా నించీని
(||pallavi||)
avadhariṁchavayyā ābĕ kaligisem̐talu
tiviri sĕmaḍamaṁchu digubāriṁchīni
(||ava||)
tenĕgāre movidoḍa teḍa māḍalāḍudānu
kānugichchi yābĕ ninnum̐ garam̐giṁchīni
sānam̐baṭṭe sūbulanu salamulu rem̐pudānu
vīnulabaṁḍuvagā vinnabālu sesīni
(||ava||)
jaṁkĕnabŏmmaladoḍa sarasamulāḍudānu
laṁkĕlabŏṁdula nābĕ laḽi rem̐sīni
kuṁkuma gubbalamīm̐di gurudulu sūbudānu
kŏṁkunum̐gŏsaru lega kŏṁgulu vaṭṭīni
(||ava||)
vĕnnĕlanavvuladoḍa veḍugalu nĕrabudā
kinnĕramīm̐ṭlanābĕ giligiṁchīni
anniḍā śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
sannala ninnum̐gūḍide savulu tā niṁchīni