అవధారు చిత్తగించవయ్యా యీకె దిక్కు
(॥పల్లవి॥)
అవధారు చిత్తగించవయ్యా యీకె దిక్కు
కవగూడి ఇపుడిట్టే కాఁగిలించవయ్యా
(॥ఆన॥)
చినుకుచిరుఁజెమట చెక్కులవెంటఁ గారఁగా
వనిత ఇదివో నీవద్దికి వచ్చె
కొనలు వేళ్లఁ దురుము కొంతగొంత ముడుచుక
యెనలేనితమితోడ నిదె నిలుచున్నది
(॥ఆన॥)
పొలపునిట్టూర్పులు పుక్కిళ్ల నాఁపుకొంటా
వెలఁది నీకు సురటి వినరీ నిదె
నెలకొన్నయాసతోడ నిన్నుఁజూచి వెరగంది
కొలువులో నీపొందు గోరుకొంటానున్నది
(॥ఆన॥)
మదనకళలెల్లా నెమ్మది మోమున నుండఁగా
సుదతి నిన్నే తప్పకచూచిఁ దాను
ఇదివో శ్రీవేంకటేశ యెనసితి వింతలొన
తెరవేసుక రతులఁ దెప్పలఁ దెలీని
(||pallavi||)
avadhāru sittagiṁchavayyā yīgĕ dikku
kavagūḍi ibuḍiṭṭe kām̐giliṁchavayyā
(||āna||)
sinugusirum̐jĕmaḍa sĕkkulavĕṁṭam̐ gāram̐gā
vanida idivo nīvaddigi vachchĕ
kŏnalu veḽlam̐ durumu kŏṁtagŏṁta muḍusuga
yĕnalenidamidoḍa nidĕ nilusunnadi
(||āna||)
pŏlabuniṭṭūrbulu pukkiḽla nām̐pugŏṁṭā
vĕlam̐di nīgu suraḍi vinarī nidĕ
nĕlagŏnnayāsadoḍa ninnum̐jūsi vĕragaṁdi
kŏluvulo nībŏṁdu gorugŏṁṭānunnadi
(||āna||)
madanagaḽalĕllā nĕmmadi momuna nuṁḍam̐gā
sudadi ninne tappagasūsim̐ dānu
idivo śhrīveṁkaḍeśha yĕnasidi viṁtalŏna
tĕravesuga radulam̐ dĕppalam̐ dĕlīni