Auraa ammaga sellaa

ఔరా అమ్మక చెల్లా
Year
Language

పల్లవి:

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా

బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా

ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి
ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవ్వరికి

బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!

ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా

చరణం 1:

ఊ..ఊ..నల్లరాతి కండలతో హోయ్ కరుకైనవాడే
ఊ..ఊ..వెన్నముద్ద గుండెలతో హోయ్ కరుణించు తోడే

నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల

ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణ జానపదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల

బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా

చరణం 2:

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల

వేలితో కొండను ఎత్తే కొండంత వేలుపటే ఆ నందలాల
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా... గోపాలుడా... లోకాల పాలుడా...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా

pallavi:

aurā ammaga sĕllā! ālagiṁchi nammaḍamĕllā
aṁta viṁtagāthallo ānaṁdalālā

bābure brahmagu sĕllā vainamaṁta valliṁchavĕllā
reballĕ vāḍallo ānaṁda līlā

ainavāḍe aṁdarigī ainā aṁdaḍu ĕvvarigi
ainavāḍe aṁdarigī ainā aṁdaḍu ĕvvarigi

bāluḍā... gobāluḍā... logāla pāluḍā...
tĕlisedi ĕlā ĕlā sāṁgubhaḽā!
tĕlisedi ĕlā ĕlā sāṁgubhaḽā!

aurā ammagasĕllā! ālagiṁchi nammaḍamĕllā
aṁta viṁtagāthallo ānaṁdalālā

saraṇaṁ 1:

ū..ū..nallarādi kaṁḍalado hoy karugainavāḍe
ū..ū..vĕnnamudda guṁḍĕlado hoy karuṇiṁchu toḍe

nallarādi kaṁḍalado karugainavāḍe ā naṁdalāla
vĕnnamudda guṁḍĕlado karuṇiṁchu toḍe ānaṁdalīla

āyudhālu paṭṭanu aṁṭū bāva baṁḍi tolibĕṭṭe ā naṁdalāla
jāṇa jānabadālado jñānanīdi palugunaḍe ānaṁdalīla

bāluḍā... gobāluḍā... logāla pāluḍā...
tĕlisedi ĕlā ĕlā sāṁgubhaḽā!

aurā ammaga sĕllā! ālagiṁchi nammaḍamĕllā
aṁta viṁtagāthallo ānaṁdalālā
bābure brahmagu sĕllā vainamaṁta valliṁchavĕllā
reballĕ vāḍallo ānaṁda līlā

saraṇaṁ 2:

ālamaṁda kābarilā kanibiṁchaledā ā naṁdalāla
ālamaṁdu kāḽuḍilā anubiṁchu kādā ānaṁdalīla

velido kŏṁḍanu ĕtte kŏṁḍaṁta velubaḍe ā naṁdalāla
tulasī daḽānige teliboyi tūgunaḍe ānaṁdalīla

bāluḍā... gobāluḍā... logāla pāluḍā...
tĕlisedi ĕlā ĕlā sāṁgubhaḽā

aurā ammaga sĕllā! ālagiṁchi nammaḍamĕllā
aṁta viṁtagāthallo ānaṁdalālā
bābure brahmagu sĕllā vainamaṁta valliṁchavĕllā
reballĕ vāḍallo ānaṁda līlā